Vidhi OTT Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ విధి - స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!-rohit nanda anandhi vidhi movie streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vidhi Ott Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ విధి - స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Vidhi OTT Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ విధి - స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Nelki Naresh Kumar HT Telugu
Jan 27, 2024 10:14 PM IST

Vidhi OTT Streaming: రోహిత్ నందా, ఆనంది హీరోహీరోయిన్లుగా న‌టించిన విధి మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి శ్రీకాంత్‌, శ్రీనాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 విధి మూవీ
విధి మూవీ

Vidhi OTT Streaming: 2023లో రిలీజైన టాలీవుడ్ సోషియో ఫాంట‌సీ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ విధి ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జ‌న‌వ‌రి 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విధి మూవీలో రోహిత్ నందా, ఆనంది హీరోహీరోయిన్లుగా న‌టించారు. శ్రీకాంత్‌, శ్రీనాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన దాదాపు మూడు నెల‌ల త‌ర్వాత విధి మూవీ ఓటీటీలో ఈ మూవీ వ‌చ్చింది.ఈ సినిమాకు శ్రీనాథ్ రంగ‌నాథ‌న్ క‌థ‌ను అందిస్తూనే కెమెరామెన్‌గా, ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించాడు.

విధి మూవీ క‌థ ఇదే...

సూర్య (రోహిత్ నందా) ఓ ప‌ల్లెటూరి కుర్రాడు. ఉద్యోగం కోసం సిటీకి వ‌స్తాడు. సూర్య త‌న‌ ఫ్రెండ్ ద‌గ్గ‌ర ఖ‌రీదైన ఓ పెన్ చూస్తాడు. అలాంటి పెన్ అనుకోకుండా సూర్య‌కు దొరుకుతుంది. కానీ ఆ పెన్‌తో ఎవ‌రూ రాసినా వాళ్లు చ‌నిపోతుంటారు. ఆ పెన్ కార‌ణంగా సూర్య స్నేహితులు మ‌నోజ్‌, చింటుల‌కు ఏమైంది? ఆ పెన్ వెన‌కున్న మిస్ట‌రీని సూర్య ఎలా సాల్వ్ చేశాడు?

చిన్న‌ప్ప‌టి నుంచి తాను ఇష్ట‌ప‌డుతోన్న ప‌ల్ల‌వికి (ఆనంది)సూర్య త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? సూర్య‌, ప‌ల్ల‌వి ఒక్క‌ట‌య్యారా లేదా అన్న‌దే విధి మూవీ క‌థ‌.ఈ సినిమాలో పెన్ పాత్ర కీల‌కంగా ఉంటుంది. పెన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్‌గా డైరెక్ట‌ర్స్ శ్రీకాంత్‌, శ్రీనాథ్ విధి మూవీ క‌థ‌ను రాసుకున్నారు. హీరోగా రోహిత్ నందాకు ఇదే ఫ‌స్ట్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇందులో రంగ‌స్థ‌లం మ‌హేష్ హీరో ఫ్రెండ్‌గా క‌నిపించాడు. అత‌డితో పాటు గౌరీశంక‌ర్‌, మీసం సురేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు గూఢ‌చారి, మేజ‌ర్ సినిమాల ఫేమ్‌ శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ అందించాడు. అత‌డు త‌ప్పు విధి సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రూ కొత్త‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. శ్రీచ‌ర‌ణ్ బీజీఎమ్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

విధికి సీక్వెల్‌...

విధి సినిమాకు సీక్వెల్‌గా విధి2ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు డైరెక్ట‌ర్స్ ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ పార్ట్‌లో న‌టించిన రోహిత్ నందా, ఆనంది పాత్ర‌ల‌తో పాటు మ‌రికొన్ని కొత్త క్యారెక్ట‌ర్స్ సీక్వెల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మారుతి బ‌స్‌స్టాప్…

విధి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన ఆనంది తెలుగ‌మ్మాయి కావ‌డం గ‌మ‌నార్హం. వ‌రంగ‌ల్‌కు చెందిన ఆనంది మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బ‌స్‌స్టాప్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆనంది. ఆ త‌ర్వాత క‌య‌ల్‌తో త‌మిళంలో మంచి పేరు తెచ్చుకున్న‌ది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

క‌య‌ల్‌లో కోలీవుడ్‌లో సెటిల్ అయిన ఆనంది కోలీవుడ్‌లో ఇర‌వైకిపైగా సినిమాలు చేసింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత జాంబీరెడ్డితో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన ఆనంది సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంట‌ర్‌, అల్ల‌రి న‌రేష్ ఇట్లు మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేసింది. నాగ‌చైత‌న్య క‌స్ట‌డీలోనూ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపించింది.

IPL_Entry_Point