Kantara 2 Update: కాంతారా 2 షూటింగ్ ఆ రోజు ప్రారంభం కానుందా!
Kantara 2 Update: కాంతార 2 సినిమా చిత్రీకరణ గురించి ఓ అప్‍డేట్ బయటికి వచ్చింది. ఈ తేదీన సెట్స్ పైకి వెళుతుందో సమాచారం వెల్లడైంది.
Kantara 2 Update: హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమా సంచలనం సృష్టించింది. కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత రికార్డులను బద్దలుకొట్టిన ఈ సినిమా.. తెలుగు, హిందీలోనూ అదరగొట్టింది. అందరి ప్రశంసలు అందుకుంది. బ్లాక్‍బ్లాస్టర్‌గా నిలిచింది. కాంతారా-2 మూవీని కూడా రిషబ్ శెట్టి ప్రకటించాడు. దీంతో ఈ సినిమా గురించి అందరూ వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో కాంతార-2 గురించి ఓ అప్‍డేట్ బయటికి వచ్చింది.
కాంతార 2 షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు 27న ప్రారంభం అవుతుందని రిపోర్టులు బయటికి వస్తున్నాయి. ఆగస్టు 27న ఈ మూవీ లాంచ్ అవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి కొన్ని సీన్లు వర్షాకాలంలో తీయాల్సి ఉండడంతో ఆగస్టులోనే రిషబ్ శెట్టి షూటింగ్ మొదలుపెడతారని హొంబాలే ఫిల్మ్స్ ఫౌండర్ విజయ్ కిరగంధూర్ ఇటీవల పేర్కొన్నారు. కాంతార దేశవ్యాప్తంగా సూపర్ హిట్ కావటంతో కాంతార 2ను భారీ బడ్జెట్‍తో ప్లాన్ చేశారు రిషబ్. హొంబాలే ఫిల్మ్ ఈ కాంతార మూవీని నిర్మిస్తోంది.
కాంతార సినిమాకు ఈ రెండో భాగం స్వీక్వెల్‍గా కాకుండా ప్రీక్వెల్‍గా ఉండనుంది. ఈ విషయాన్ని రిషబ్ శెట్టి గతంలో ఓసారి చెప్పారు. అంటే కాంతార మూవీ ప్రారంభం ముందు ఏం జరిగిందో ఈ ప్రీక్వెల్‍లో ఉంటుంది. “సాధారణంగా చెప్పాలంటే.. మీరు చూసింది పార్ట్ 2 అని చెప్పవచ్చు. పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుంది. కాంతారా షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఎందుకంటే కాంతార హిస్టరీ చాలా లోతుగా ఉంటుంది. మేం ఇంకా పరిశోధన చేస్తున్నాం” అని రిషబ్ శెట్టి చెప్పాడు.
ఈ ఏడాది మార్చిలో ఉగాది సందర్భంగా కాంతార 2 స్క్రిప్ట్ పనులను రిషబ్ శెట్టి మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనులు తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
గతేడాది విడుదలైన కాంతార సినిమా.. భారీ హిట్‍గా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. తెలుగు, హిందీలోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. సప్తమి గౌడ హీరోయిన్‍గా నటించిన ఈ చిత్రంలో కిశోర్, అత్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. కాంతార 2 మూవీని 2024 రెండో అర్ధభాగంలో విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసుకుంది.
టాపిక్