Srikanth Odela Next Movie: దసరా డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. తదుపరి చిత్రంలో హీరో ఫిక్స్..!-reportedly dasara director srikanth odela next movie with akhil akkineni ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srikanth Odela Next Movie: దసరా డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. తదుపరి చిత్రంలో హీరో ఫిక్స్..!

Srikanth Odela Next Movie: దసరా డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. తదుపరి చిత్రంలో హీరో ఫిక్స్..!

Maragani Govardhan HT Telugu
Apr 07, 2023 08:31 PM IST

Srikanth Odela Next Movie: ఇటీవల విడుదలై సూపర్ హిట్ సాధించిన దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతడికి అక్కినేని ఫ్యామిలీ నుంచి పిలుపు వచ్చిందని, అఖిల్ అక్కినేనితో ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

దసరా డైరెక్టర్ మూవీ తదుపరి చిత్రం ఎవరితోనో తెలుసా?
దసరా డైరెక్టర్ మూవీ తదుపరి చిత్రం ఎవరితోనో తెలుసా?

Srikanth Odela Next Movie: టాలీవుడ్‌లో తొలి చిత్రంతోనే పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ ఓదెల్. దసరా సినిమాతో తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా తన మార్కును చాటాడు ఈ యువ డైరెక్టర్. ఈ సినిమా ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. నేచురల్ స్టార్ నానితో తీసిన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తొలి సినిమాతోనే అరుదైన ఘనత సాధించాడు శ్రీకాంత్. దీంతో అతడికి అప్పుడే ఆఫర్లు క్యూ కట్టాయి.

ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం శ్రీకాంత్‌కు అక్కినేని కుటుంబం నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. అఖిల్ అక్కినేనితో సినిమా చేసేందుకు అతడికి అవకాశం వచ్చిందట. ఇప్పటికే సినిమా గురించి సంప్రదింపులు కూడా నడిచాయట. ఇంక శ్రీకాంత్‌.. అఖిల్‌కు కథ చెప్పడమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఏజెంట్ నుంచి అఖిల్ ఫ్రీ అయితే శ్రీకాంత్‌తో సినిమా గురించి చర్చలు జరుగుతాయని సమాచారం.

అఖిల్‌తో శ్రీకాంత్ ఓదెల తీయబోయే సినిమాకు దసరాను నిర్మించిన సుధాకర్ చెరుకూరినే నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ సినిమాను కూడా ఆయన నిర్మించి విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

నాని నటించిన దసరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ మూవీకి రెస్పాన్స్ బాగా వస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.

IPL_Entry_Point

టాపిక్