Rashmi About Sudheer: మా మధ్య ఏముందో చెప్పాల్సిన అవసరంలేదు.. సుధీర్‌తో బంధంపై రష్మీ షాకింగ్ కామెంట్స్..!-rashmi gautam reaction on rumours with sudigaali sudheer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmi About Sudheer: మా మధ్య ఏముందో చెప్పాల్సిన అవసరంలేదు.. సుధీర్‌తో బంధంపై రష్మీ షాకింగ్ కామెంట్స్..!

Rashmi About Sudheer: మా మధ్య ఏముందో చెప్పాల్సిన అవసరంలేదు.. సుధీర్‌తో బంధంపై రష్మీ షాకింగ్ కామెంట్స్..!

Maragani Govardhan HT Telugu
Nov 08, 2022 09:33 AM IST

Rashmi About Sudheer: సుడిగాలి సుధీర్‌తో తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి జబర్దస్త్ రష్మీ గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తామిద్దరి మధ్య ఉన్న బంధం గురించి అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానమిచ్చింది.

రష్మీ-సుధీర్
రష్మీ-సుధీర్

Rashmi About Sudheer: జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్‌లు తెలుగు నాట అందరికీ సుపరిచితమే. వీరిద్దరి మధ్య ఉంది స్నేహమా, ప్రేమా అనే ప్రశ్న చాలా రోజుల నుంచి వెంటాడుతూనే ఉంది. ఈ ప్రశ్నకు వీరిద్దరూ కూడా ఎప్పుడూ కుండబద్దలుకొట్టినట్లు సమాధానం చెప్పింది కూడా లేదు. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విస్తృతంగా వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. ప్రేమించుకుంటే ఒప్పుకోవచ్చు కదా.. ఈ డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు అని నెటిజన్లు చాలా మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి రష్మీని ఇదే ప్రశ్న అడుగ్గా.. ఆమె తమ బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి అందరికీ చెబితే అది తన జీవితం ఎందుకు అవుతుంది అంటూ ఘాటుగా స్పందించారు.

"నా గురించి అందరికీ వివరిస్తుంటే అది నా జీవితం కాదు. అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగతం. మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలను నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేము ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేము అనుకొని ఇదంతా చేయలేదు. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీని అందర్నీ ఆకర్షించింది." అని రష్మి తెలిపారు.

జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్, రష్మీ ఇద్దరూ పనిచేశారు. ఈ షోలో ఇద్దరి సాన్నిహిత్యం చూసి వీరిమధ్య ఏదో నడుస్తుందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చి బయట ఇతర షోల్లో చేస్తుూనే మరోపక్క సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రష్మీ కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మా బ్లాక్ బాస్టర్ చిత్రం ఇటీవలై విడుదలైంది. ఇందులో నందూ హీరోగా చేయగా.. రష్మీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంతో రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కిరిటీ, దామరాజు, రఘు కుంచే కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ పగడాల, బోసుబాయి నిడుమోలు నిర్మాతలుగా వ్యవహరించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం