ఇటలీ నుంచి మెగాస్టార్ కుటుంబ చిత్రం.. ఉమ్మడిగా పోస్ట్ చేసిన రాంచరణ్, ఉపాసన-ram charan upasana and chiranjeevi explore italy ahead of varun lavanya wedding ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇటలీ నుంచి మెగాస్టార్ కుటుంబ చిత్రం.. ఉమ్మడిగా పోస్ట్ చేసిన రాంచరణ్, ఉపాసన

ఇటలీ నుంచి మెగాస్టార్ కుటుంబ చిత్రం.. ఉమ్మడిగా పోస్ట్ చేసిన రాంచరణ్, ఉపాసన

HT Telugu Desk HT Telugu
Oct 29, 2023 06:43 PM IST

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం రామ్ చరణ్, అతని కుటుంబం ఇటలీ వెళ్లారు. ఫ్యామిలీ పిక్ ఇక్కడ చూసేయండి.

చిరంజీవి కుటుం సభ్యులు, చిత్రంలో రాంచరణ్ తనయ క్లిన్‌కారా కూడా
చిరంజీవి కుటుం సభ్యులు, చిత్రంలో రాంచరణ్ తనయ క్లిన్‌కారా కూడా

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలకు ముందు కొణిదెల, కామినేని కుటుంబాలు ఇటలీకి చేరుకుని పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నారు. ఆదివారం రామ్‌చరణ్, ఉపాసన, చిరంజీవి ఇతర కుటుంబ సభ్యులతో కూడిన చిత్రాన్ని ఉపాసన ఇన్‌స్టాలో పంచుకున్నారు. వరుణ్ లావణ్య జంట నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారు. ఆ తర్వాత ఇండియాలో రెండు వెడ్డింగ్ రిసెప్షన్‌లను నిర్వహించనున్నారు.

ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఉమ్మడిగా ఈ ఫోటో షేర్ చేశారు. చిత్రంలో రామ్ చరణ్, ఉపాసన ఒకరి పక్కన మరొకరు నిలబడి ఉన్నారు. చిరంజీవి పక్కన కూర్చొని, ఇతర కుటుంబ సభ్యులతో ఉన్నారు. మధ్యలో రామ్ చరణ్ ముద్దుల తనయ క్లిన్ కారాను కూడా చూడొచ్చు. ఆమె ముఖం హార్ట్ ఎమోటికాన్‌తో దాచేశారు.

ఈ చిత్రాన్ని పంచుకుంటూ, ఉపాసన ‘టస్కానీలో కొణిదెల, కామినేని సెలవుదినం! హృదయమంతా ఒకే ఫ్రేమ్‌లో.. ఈ చిరస్మరణీయ అనుభవానికి ధన్యవాదాలు సాల్వటోర్ ఫెర్రాగామో..’ అని క్యాప్షన్ ఇచ్చారు.

క్లిన్ కారా ముఖాన్ని దాచిపెట్టినప్పటికీ, క్రింద ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఆమె ప్రతిబింబం స్పష్టంగా కనబడుతోందని అభిమానులు కామెంట్లు చేశారు. ‘ఉప్సీ అక్కా మీరు నీటిపై ప్రతిబింబించే క్లిన కారా ముఖంపై హృదయాన్ని ఉంచడం మర్చిపోయారు..’ అని ఒక అభిమాని రాశారు. మరో అభిమాని కూడా, "అమ్మా.. మేం నీటి ప్రతిబింబంపై పాప ముఖాన్ని చూశాం..’ అని రాశారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్, సహా కజిన్స్ అందరూ బయలుదేరి వెళ్లారు. ఆదివారం అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.

Whats_app_banner