HIT Trailer: హిందీ 'హిట్' ట్రైలర్ చూశారా.. ఓ లుక్కేయండి?
తెలుగులో సూపర్ హిట్టయిన హిట్ ది పస్ట్ కేస్ చిత్రాన్ని అదే పేరుతో హిందీలోనూ రీమేక్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటించారు. మాతృకను తెరకెక్కించిన సైలేశ్ కోనేరునే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్‌కుమార్ రావు. అతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హిట్ ది ఫస్ట్ కేస్. ఈ సినిమా 2020లో తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాకు అఫిషియల్ రీమేక్. ఈ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు సరసన దంగల్ ఫేమ్ సాన్యా మల్హోత్రా హీరోయిన్ చేసింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
తెలుగులో మాదిరిగా కథలో పెద్దగా మార్పులేమి లేకుండా ఆద్యంతం థ్రిల్లర్ జోనర్‌లోనే తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. రాజ్‌కుమార్ రావు తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
తెలుగు మాతృకను తెరకెక్కించిన సైలేశ్ కోనేరునే హిందీలోనూ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందీ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సైలేశ్ కోనేరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి-సిరీస్ ఫిల్మ్స్, దిల్ రాజు ప్రొడక్షన్ పతాకాలపై నిర్మిస్తున్నారు. భూషన్ కుమార్, కృష్ణ కుమార్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్ ఈ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్, మిథున్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
సంబంధిత కథనం
టాపిక్