Ram Charan Sukumar Movie: రామ్‌చరణ్- సుకుమార్ మూవీని కన్ఫామ్ చేసిన రాజమౌళి
Ram Charan Sukumar Movie: రంగస్థలం తర్వాత రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి అఫీషియల్‌గా అనౌన్స్‌చేశాడు.
Ram Charan Sukumar Movie: రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నటుడిగా రామ్‌చరణ్‌ను కొత్త కోణంలో ఈ సినిమాతో ఆవిష్కరించారు దర్శకుడు సుకుమార్.
చిట్టిబాబు అనే చెవిటితనంతో బాధపడే యువకుడిగా అసమాన నటనను కనబరిచాడు రామ్‌చరణ్. 60 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 220 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రామ్‌చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. రంగస్థలం తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా అఫీషియల్‌గా కన్ఫార్మ్ అయ్యింది. సుకుమార్, రామ్‌చరణ్ సినిమాను అగ్ర దర్శకుడు రాజమౌళి రివీల్ చేశారు. లోకేష్ కనకరాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్, కమల్‌హాసన్, గౌతమ్‌మీనన్‌లతో కలిసి ఓ ఈవెంట్‌కు రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో తాను అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ఒకటని రాజమౌళి అన్నాడు. ఈ సినిమాలోని ఓపెనింగ్ సీన్‌ను చరణ్ తనకు వినిపించాడని చెప్పాడు.
ఆ సీన్ అద్భుతంగా ఉందని, తనను ఎంతగానో ఆకట్టుకున్నదని తెలిపాడు. రామ్‌చరణ్, సుకుమార్ సినిమా తొందరగా ప్రారంభం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. రాజమౌళి కామెంట్స్‌తో రామ్‌చరణ్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాజమౌళి నోటి వెంట రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మొదలైంది. రాజమౌళి మాటలను బట్టి చూస్తే వచ్చే ఏడాది ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నాడు.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే బుచ్చిబాబుతో ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవలే అనౌన్స్‌చేశాడు రామ్‌చరణ్. మరోవైపు పుష్ప-2 సినిమా షూటింగ్‌ను ఇటీవలే మొదలుపెట్టాడు సుకుమార్. పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. శంకర్ సినిమాతో పాటు పుష్ప-2 పూర్తయిన తర్వాతే రామ్‌చరణ్, సుకుమార్ సినిమా మొదలవుతోందని తెలుస్తోంది.