Prabhas Krishnam Raju Video: వావ్‌.. కృష్ణంరాజు, ప్రభాస్‌ అచ్చూ ఒకేలా.. వీడియో షేర్‌ చేసిన ప్రభాస్‌-prabhas krishnam raju video going viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Krishnam Raju Video: వావ్‌.. కృష్ణంరాజు, ప్రభాస్‌ అచ్చూ ఒకేలా.. వీడియో షేర్‌ చేసిన ప్రభాస్‌

Prabhas Krishnam Raju Video: వావ్‌.. కృష్ణంరాజు, ప్రభాస్‌ అచ్చూ ఒకేలా.. వీడియో షేర్‌ చేసిన ప్రభాస్‌

HT Telugu Desk HT Telugu
Sep 24, 2022 03:45 PM IST

Prabhas Krishnam Raju Video: కృష్ణంరాజు, ప్రభాస్‌ అచ్చూ ఒకేలా ఉన్న ఈ వీడియో చూసి మీరు వావ్‌ అనకుండా ఉండలేరు. తన పెదనాన్న, తన సినిమాల వీడియోలను పక్కపక్కనే ఉన్న వీడియోను ప్రభాస్‌ శనివారం (సెప్టెంబర్‌ 24) షేర్‌ చేశాడు.

ప్రభాస్ తో కృష్ణంరాజు
ప్రభాస్ తో కృష్ణంరాజు (facebook)

Prabhas Krishnam Raju Video: టాలీవుడ్‌లో కృష్ణంరాజుకు రెబల్‌స్టార్‌గా పేరుంది. సినిమాల్లో అతడు పోషించిన పాత్రలు, కళ్లలోని రౌద్రం, భారీ పర్సనాలిటీతో ఆ బిరుదును కృష్ణంరాజు సార్ధకం చేసుకున్నాడు. అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తర్వాత సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్‌ కూడా యంగ్‌ రెబల్‌ స్టార్‌ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు.

లుక్‌లోనే కాదు హావభావాలు, నటన అచ్చూ కృష్ణంరాజునే పోలి ఉంటాయని అభిమానులు ముద్దుగా ప్రభాస్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ అని పిలుచుకుంటారు. అయితే ఈ మధ్యే చనిపోయిన తన పెదనాన్నను స్మరించుకుంటూ శనివారం (సెప్టెంబర్‌ 24) ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో చూస్తే మాత్రం.. తనను యంగ్‌ రెబల్‌స్టార్‌ అని ఎందుకంటారో తెలిసిపోతుంది.

తన పెదనాన్న కృష్ణంరాజు సినిమాల్లోని సీన్స్‌, తన మూవీలోని సీన్స్‌ను పక్కపక్కనే ఉంచుతూ చేసిన స్పెషల్‌ వీడియో ఇది. రౌద్రం, కరుణ, ప్రేమ, భయానకం, శృంగారం.. ఇలా తమ ఇద్దరి సినిమాల్లో పలు రసాలను పలికించిన సీన్లను ప్రభాస్‌ షేర్‌ చేసుకున్నాడు. ఇందులో చాలా వరకూ అచ్చూ కృష్ణంరాజులా కనిపించే ప్రభాస్‌ను చూడొచ్చు.

ఈ వీడియోలకు బ్యాక్‌గ్రౌండ్‌లో తన హిట్‌ సినిమాలు ఛత్రపతి, బాహుబలి మూవీల్లోని మ్యూజిక్‌ను ప్రభాస్‌ జోడించాడు. ఈ వీడియో ఈ రెబల్‌స్టార్ల మధ్య ఉన్న సారూప్యతను కళ్లకు కట్టడంతోపాటు నింగికేగిన కృష్ణంరాజును తలుచుకొని ఎమోషనల్‌ అయ్యేలా కూడా ఉంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్‌ లేకుండా కేవలం హార్ట్‌, నమస్కారం ఎమోజీలను మాత్రమే ప్రభాస్‌ పోస్ట్‌ చేశాడు.

నిజానికి ఇది ఎవరో అభిమానులు చేసిన వీడియో. కానీ ప్రభాస్‌ తన పెదనాన్నను తలచుకుంటూ దీనిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోవడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. గంటలోపే లక్షల కొద్దీ లైక్స్‌, వేల కామెంట్స్‌ వచ్చాయి. చాలా మంది అభిమానులు హార్ట్‌ ఎమోజీలతో కామెంట్లు చేశారు. కృష్ణంరాజు సెప్టెంబర్‌ 11న కన్నుమూసిన విషయం తెలిసిందే. అతని స్మారకసభను సెప్టెంబర్‌ 28న మొగల్తూరులో నిర్వహించనున్నారు. దీనికి ప్రభాస్‌ కూడా వస్తున్నాడు.

IPL_Entry_Point

టాపిక్