OTT play Changemakers Awards: ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డ్స్‌కు రంగం సిద్ధం - హాజరుకానున్న ఆస్కార్ విన్నర్
OTT play Changemaker Awards 2023: ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డ్స్ ఫస్ట్ ఎడిషన్ వేడుకలు ఆదివారం (నేడు) జరుగనున్నాయి. ఈ వేడుకలకు ఆస్కార్ విన్నర్ గునీత్ మోంగాతో పాటు పలువురు బాలీవుడ్ సౌత్ సినీ సెలబ్రిటీస్ హాజరుకానున్నారు.
OTT play Changemakers Awards 2023: ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డ్స్‌కు రంగం సిద్ధమైంది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది తారల సమక్షంలో వైభవంగా ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డ్స్ ఈవెంట్ ఆదివారం (నేడు) జరుగనుంది. ఈ తొలి ఎడిషన్ అవార్డు వేడుకల్లో వివిధ విభాగాల్లో ప్రతిభను చాటిన నలభై మంది సినీ ప్రముఖులకు అవార్డులను అందజేయనున్నారు. సినీ పరిశ్రమలో కొత్త ఆలోచనలతో ట్రెడ్డ్‌సెట్టర్స్‌గా నిలిచిన సినీ ప్రముఖులను ఈ వేదికపై సత్కరించనున్నారు.
ఆస్కార్ విజేత గునీత్ మోంగా...
ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డు వేడుకలో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది తారలు ఒకే వేదికపై కనిపించి అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌కు ది ఎలిఫెంట్ విస్పరర్స్‌తో ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న దర్శకురాలు గునీత్ మోంగాతో పాటు రాజ్‌కుమార్ రావ్, అయాన్ ముఖర్జీ, ప్రసేన్‌జీత్ ఛటర్జీ, సయానీ గుప్తా హాజరుకానున్నట్లు తెలిసింది వీరితో పాటు దక్షిణాది చిత్రసీమ నుంచి రిషబ్‌శెట్టి, ఐశ్వర్యరాజేష్, జోజుజార్జ్, ప్రియమణి ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డు వేడుకలో పాలు పంచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
40 మందికి అవార్డులు
ఈ వేడుకలో తమ సృజనాత్మకతతో ప్రతిభను చాటిన నలభై మంది సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. ఫిల్మ్ మేకర్ ఇన్ ది స్పాట్‌లైట్, పాథ్‌బ్రేకింగ్ పర్ఫార్మర్, ఎంటర్‌టైనర్ ఆఫ్ ది డికేడ్, బెస్ట్ వీఎఫ్ఎక్స్, రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు పలు విభాగాల్లో పురస్కారాలను అందించబోతున్నారు.
ప్రతిభకు పట్టం...
వినోదం రంగంలో నిరంతరం నూతన మార్గాల్ని అన్వేషిస్తూ వినూత్న ఆలోచనలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్నఫిల్మ్ మేకర్స్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డులను అందజేస్తోన్నట్లు ఓటీటీ ప్లే సీఈఓ అవినాష్ మొదలియార్ పేర్కొన్నారు.
ట్రెండ్‌సెట్టర్స్ గా నిలిచిన ఫిలిం మేకర్స్ విజయాల్నిప్రపంచానికి తెలియజేసే చక్కటి వేదికగా ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డ్స్ వేడుక నిలుస్తోందని అవినాష్ మొదలియార్ అన్నారు. నూతన ప్రతిభకు పట్టం కట్టడంతో పాటు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించేలా ఈ అవార్డు వేడుకలు నిలుస్తాయని, భవిష్యత్తులో అదే లక్ష్యంతో అవార్డు వేడుకల్ని కొనసాగిస్తామని అవినాష్ మొదలియార్ అన్నారు.