OTT Releases: ఓటీటీలో ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. ఎక్కడ చూస్తారంటే?-ott movies releases on this friday gaami ott to om bheem bush ott release netflix amazon prime aha ott disney hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీలో ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. ఎక్కడ చూస్తారంటే?

OTT Releases: ఓటీటీలో ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. ఎక్కడ చూస్తారంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 11, 2024 10:44 AM IST

OTT Releases On This Friday: ఓటీటీలో ఎప్పటికప్పుడు యూనిక్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ప్రతివారం పదుల్లో చిత్రాలు, సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అయితే, కేవలం ఒక్కరోజే ఏకంగా పదకొండు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా.

ఓటీటీలో ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. ఎక్కడ చూస్తారంటే?
ఓటీటీలో ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. ఎక్కడ చూస్తారంటే?

Friday OTT Streaming Movies: ప్రతి వారం డిఫరెంట్ అండ్ యూనిక్ కంటెంట్‌తో అలరిస్తుంటాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. ఇప్పుడు మరో వారంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరికొన్ని చిత్రాలు రానున్నాయి. అయితే, వీకెండ్‌కు ముందు రోజు ఓటీటీలో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 12న ఏకంగా 11 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ కానున్నాయి. మరి ఈ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌‌‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఓం భీమ్ బుష్ (తెలుగు కామెడీ హారర్ మూవీ)- ఏప్రిల్ 12

ఎన్‌డబ్ల్యూఎస్ఎల్ (అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 12

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

రజనీకాంత్ లాల్ సలామ్ (తమిళ డబ్బింగ్ మూవీ)- ఏప్రిల్ 12

అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12

గుడ్ టైమ్స్ (యానిమేటెడ్ సిట్ కామ్)- ఏప్రిల్ 12

లవ్ డివైడెడ్ (స్పానిష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఏప్రిల్ 12

స్టోలెన్ (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12

ఊడీ ఉడ్ పెక్కర్ గోస్ టూ క్యాంప్ 2024 (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)- ఏప్రిల్ 12

లాల్ సలామ్ సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ ప్లాట్ ఫామ్- ఏప్రిల్ 12

గామి (తెలుగు మూవీ)- జీ5 ఓటీటీ సంస్థ- ఏప్రిల్ 12

ప్రేమలు (తెలుగు వెర్షన్)- ఆహా ఓటీటీ సంస్థ- ఏప్రిల్ 12

ప్రేమలు తమిళ, మలయాళ, హిందీ వెర్షన్- డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీ- ఏప్రిల్ 12

హైటౌన్ సీజన్ 3 (హాలీవుడ్ వెబ్ సిరీస్)- జియో సినిమా- ఏప్రిల్ 12

5 స్పెషల్

ఇలా ఈ ఫ్రైడే (ఏప్రిల్ 12) ఏకంగా 11 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి విడుదల కానున్నాయి. వీటిలో సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్ కాంబినేషన్ మూవీ లాల్ సలామ్, మాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ప్రేమలు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విశ్వక్ సేన్ గామి జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ మూడు స్పెషల్ సినిమాలతోపాటు అమర్ సింగ్ చమ్కిలా కాస్తా క్యూరియాసిటీ కలిగించే సినిమా.

20 రోజులకే

ఇక ఇవే కాకుండా తెలుగులో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్‌గా వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ అనంతరం 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాలో హీరోలుగా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.

IPL_Entry_Point