Crime Thriller: తొలిసారి ఇలా.. సినిమాగా వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వివరాలివే-ott action crime thriller web series mirzapur coming as movie for theater know the details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thriller: తొలిసారి ఇలా.. సినిమాగా వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వివరాలివే

Crime Thriller: తొలిసారి ఇలా.. సినిమాగా వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 28, 2024 12:57 PM IST

Mirzapur OTT Web Series as Movie: మీర్జాపూర్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఈ సిరీస్ ఇప్పుడు సినిమాగా రూపొందనుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Crime Thriller: తొలిసారి ఇలా.. సినిమాగా వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వివరాలివే
Crime Thriller: తొలిసారి ఇలా.. సినిమాగా వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వివరాలివే

ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఓ పాపులర్ వెబ్ సిరీస్.. మూవీలా రూపొందనుంది. సిరీస్ సినిమాగా రావడం ఇండియాలో దాదాపు ఇదే తొలిసారి. భారీ వ్యూస్‍తో మోస్ట్ సక్సెస్‍ఫుల్ వెబ్ సిరీస్‍గా ఉన్న మీర్జాపూర్ సిరీసే.. చిత్రంగా రానుంది. ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ఈ విషయంపై నేడు (అక్టోబర్ 28) అధికారిక ప్రకటన వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీర్జాపూర్ మూడో సీజన్ ఈ ఏడాది జూలైలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇప్పుడు మీర్జాపూర్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది.

yearly horoscope entry point

థియేటర్లలోనే..

మీర్జాపూర్ వెబ్ సిరీస్‍లో మూడు సీజన్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అయితే, ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’ చిత్రం మాత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. 2026లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. మీర్జాపూర్ సిరీస్‍లో ఉన్న పాత్రలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. అయితే, కథ డిఫరెంట్‍గా ఉండే ఛాన్స్ ఉంది.

మున్నా మళ్లీ వచ్చేస్తున్నాడు

మీర్జాపూర్ సిరీస్‍లో దివ్యేందు శర్మ పోషించిన మున్నా త్రిపాఠి పాత్ర చాలా పాపులర్ అయింది. అయితే, ఈ సిరీస్ రెండో సీజన్‍లో మున్నా హత్యకు గురవుతాడు. అయితే, మీర్జాపూర్: ది ఫిల్మ్ చిత్రంలో మున్నా పాత్ర ఉండనుంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫైజల్, అభిషేక్ బెనర్జీ, దివ్యేందుతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోను అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు (అక్టోబర్ 28) రివీల్ చేసింది.

ఈ వీడియోలో దివ్యేందు కూడా కనిపించారు. “నేను హిందీ సినిమా హీరో. హిందీ చిత్రాన్ని థియేటర్లలో బెస్ట్‌గా ఎంజాయ్ చేయవచ్చు. నేను మళ్లీ గుర్తు చేస్తున్నా.. నేను మరణం లేని వాడిని” అని హిందీలో దివ్యేందు చెప్పారు. దీంతో మున్నా క్యారెక్టర్ ఈ చిత్రంలో ఉండడం ఖాయమని అర్థమవుతోంది.

మీర్జాపూర్ సినిమా గురించి..

మీర్జాపూర్ సినిమాలో కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిట్ (అలీ ఫైజల్), మున్నా త్రిపాఠి (దివ్యేందు), కాంపౌండర్ (అభిషేక్ బెనర్జీ) పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయి. ఈ చిత్రానికి పునీత్ కృష్ణ క్రియేటర్‌గా ఉండగా.. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిధ్వానీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేయనున్నారు. ఖాసిం జగ్మాగియా, విశాల్ రామ్‍చందర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మీర్జాపూర్ తొలి సీజన్ 2018 నవంబర్ నెలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి సక్సెస్ సాధించింది. రెండో సీజన్ అక్టోబర్ 2020లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఫస్ట్ సీజన్ కంటే రెండోది మరింత భారీ వ్యూస్ దక్కించుకుంది. సెక్రేడ్ గేమ్స్ తర్వాత మోస్ట్ పాపులర్ సిరీస్‍గా మీర్జాపూర్ నిలిచింది. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత మీర్జాపూర్ మూడో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, తొలి రెండు సీజన్లలా ఈ సీజన్ పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయినా మూడో సీజన్ కూడా వ్యూస్‍లో దుమ్మురేపింది. క్యారెక్టల్లు, థీమ్ అవే ఉన్నా సిరీస్‍తో పోలిస్తే మీర్జాపూర్ మూవీ స్టోరీ భిన్నంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner