OTT Action Comedy: ఓటీటీలోకి 9 నెలల తర్వాత వచ్చిన యాక్షన్ కామెడీ రివేంజ్ డ్రామా.. ఆ నటుడి చివరి సినిమా ఇదే
OTT Action Comedy: ఓటీటీలోకి ఓ యాక్షన్ కామెడీ మూవీ 9 నెలల తర్వాత వచ్చింది. దివంగత బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ నటించిన చివరి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ మూవీకి ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది.
OTT Action Comedy: ఓటీటీలోకి మరో యాక్షన్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సుమారు 9 నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. దివంగత నటుడు సతీష్ కౌశిక్ చివరి మూవీ ఇదే. అతనితోపాటు రాజ్ బబ్బర్, అనూప్ సోనీ, శ్వేతాబ్ సింగ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతోపాటు ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ వచ్చింది.
మిర్గ్ ఓటీటీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి తాజాగా వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ పేరు మిర్గ్ (Mirg). తరుణ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని మిర్గ్ అనే ఓ పర్వత చిరుత బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇది. ఈ మూవీలో దివంగత నటుడు సతీష్ కౌశిక్ ఓ కీలకపాత్ర పోషించాడు. అతడు చనిపోవడానికి ముందు తీసిన చివరి సినిమా ఇదే.
మిర్గ్ మూవీ ఎలా ఉందంటే?
మిర్గ్ మూవీ ఓ రివేంజ్ డ్రామా. ఈ మూవీ ఎవరు ఏం చెప్పినా వినే, అందరి చేతా అణచివేతకు గురయ్యే అనిల్ (శ్వేతాబ్ సింగ్) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. తనతోపాటు పని చేసే రవి అనే వ్యక్తితో జరిగిన ఓ ఘటన అనిల్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ రవి పాత్రలోనే సతీష్ కౌశిక్ నటించాడు.
హిమాచల్ ప్రదేశ్ అడవులు, అక్కడి మిర్గ్ అనే పర్వత చిరుత బ్యాక్‌డ్రాప్ లో ఈ స్టోరీ సాగుతుంది. ఇందులో రాజ్ బబ్బర్ ఓ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు.
ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ ఉండటం విశేషం. ఇలాంటి సినిమాలను ఓటీటీల్లో ప్రేక్షకులు ఆదరించడం చూస్తున్నాం. దీంతో ఈ మిర్గ్ మూవీ కూడా జియో సినిమాలో మంచి రెస్పాన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. జియో సినిమా ప్రీమియం ప్లాన్ నెలకు కేవలం రూ.29కే పొందవచ్చు. ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే.. ఇందులోని అన్ని మూవీస్, వెబ్ సిరీస్, స్పోర్ట్స్ లాంటివన్నీ ఫ్రీగా చూసేయొచ్చు.