Ntr - Amit shah: అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ - ఆస‌క్తిక‌రంగా మారిన మీటింగ్‌-ntr to meet amit shah in hyderabad on sunday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr - Amit Shah: అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ - ఆస‌క్తిక‌రంగా మారిన మీటింగ్‌

Ntr - Amit shah: అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ - ఆస‌క్తిక‌రంగా మారిన మీటింగ్‌

HT Telugu Desk HT Telugu
Aug 21, 2022 12:45 PM IST

ఆదివారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో(Amit shah) టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ (Ntr)భేటీ కాబోతున్నారు. ఈ స‌మావేశం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎన్టీఆర్
ఎన్టీఆర్ (twitter)

Ntr - Amit shah Meeting: మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారం నిమిత్తం నేడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌లకు ఆయ‌న హైద‌రాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే బీజేపీ నాయ‌కుల‌తో పాటు పలువురు ప్రముఖుల్ని కలవబోతున్నారు. కాగా అమిత్ షా టూర్‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం అగ్ర హీరో ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ కాబోతున్న‌ట్లు తెలిసింది.

అమిత్ షా ఆహ్వానం మేర‌కు ఎన్టీఆర్ ఆయ‌న్ని క‌ల‌వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అమిత్ షాతో క‌లిసి ఎన్టీఆర్ లంచ్ చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. దాదాపు ప‌దిహేను నిమిషాల పాటు ఈ భేటీ జ‌రుగ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌తో అమిత్ షా ఏం మాట్లాడుతాడ‌న్న‌ది రాజ‌కీయ‌, సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పెద్ద విజ‌యాన్ని ద‌క్కించుకున్నాడు.

ఇందులో బ్రిటీష‌ర్ల దురాగ‌తాల‌ను ఎదురించిన పోరాడిన కొమురంభీమ్ అనే యోధుడిగా అద్వితీయ న‌ట‌న‌తో దేశ‌, విదేశీ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని ఎన్టీఆర్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న త‌న‌ను ఆక‌ట్టుకున్న‌ద‌ని గ‌తంలో అమిత్ షా వెల్ల‌డించారు. అత‌డి యాక్టింగ్ కు ఫిదా అయిన‌ట్లు చెప్పాడు. ఆర్ఆర్ఆర్ విజ‌యాన్ని పుర‌స్క‌రించుకొని ఎన్టీఆర్ ను అభినందించ‌డానికే అమిత్ షా అత‌డిని ఆహ్వానించాడా? లేదా ఈ భేటీ వెనుక రాజ‌కీయ కోణాలు ఉన్నాయా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రానుంది.

IPL_Entry_Point

టాపిక్