Nijame Ne Chebutunna Song Lyrics: నిజమే నే చెబుతున్నా సాంగ్ లిరిక్స్ - 30 మిలియన్ల వ్యూస్ సాధించిన సిద్ శ్రీరామ్ సాంగ్
Nijame Ne Chebutunna Song Lyrics: ఊరి పేరు భైరవకోన సినిమాలోని నిజమే నే చెబుతున్నా సాంగ్ యూ ట్యూబ్‌లో 30 మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకొంది. టాలీవుడ్ చార్ట్‌బాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
Nijame Ne Chebutunna Song Lyrics: ఊరి పేరు భైరవకోన సినిమాలోని నిజమే నే చెబుతున్నా పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ చార్ట్ బాస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సాంగ్‌కు ఇప్పటికే యూ ట్యూబ్‌లో 30 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చారు. ఊరి పేరు భైనవకోన సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
నిజమే నే చెబుతున్నా సాంగ్స్ లిరిక్స్ ఇవే...
నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్న
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దొచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా
తానారే రారారె రారారెనా
తారారె నానారెరే
తానారే నానారె తానారెనా
తారారే రారారరే
వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాట తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే
కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్న
అడుగులతోటి దూరం కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని పయణంకానా
నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా.