Nargis Fakri: న్యూడ్‌గా నటించను కానీ.. ఆ సీన్లకైతే ఓకే: నటి సంచలన వ్యాఖ్యలు
Nargis Fakri: న్యూడ్‌గా నటించను కానీ.. ఆ సీన్లకైతే ఓకే అంటూ బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. హోమోసెక్సువల్ గా నటించడానికి తాను సిద్ధమే అని ఆమె చెప్పడం విశేషం.
Nargis Fakri: ఓటీటీలు ఎప్పుడైతే వచ్చాయో.. ఆర్టికల్ 377 ఎప్పుడైతే ఎత్తేశారో అప్పటి నుంచీ తెరపై హోమోసెక్సువల్ సీన్లు చాలా సాధారణమైపోయాయి. దాదాపు ప్రతి సినిమా, సిరీస్ లో దీనికి సంబంధించిన పాత్రలు కనిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ కూడా తాను హోమోసెక్సువల్ గా నటించడానికి సిద్ధమే అని చెప్పడం విశేషం. ఆమె హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో విచ్చలవిడి శృంగారం నట్టింట్లోకి వచ్చేసింది. బోల్డ్ సీన్లు తీయడానికి డైరెక్టర్లు, చేయడానికి నటీనటులు పోటీపడుతున్నారు. దీంతో త్వరలోనే ఓటీటీలోకి అడుగుపెడుతున్న నర్గిస్ కూడా దీనిపై స్పందించింది. మరీ న్యూడ్ గా నటించను కానీ.. హోమోసెక్సువల్ పాత్ర అయితే చేయగలనని ఆమె చెప్పింది.
ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించడానికి ఓటీటీలు నటీనటులకు మంచి అవకాశం ఇస్తోందని కూడా ఈ సందర్భంగా నర్గిస్ చెప్పింది. ఇప్పుడామె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నర్గిస్ తెలుగు తెరపై కూడా కనిపించబోతోంది. ఆమె పవన్ కల్యాణ్ తో కలిసి హరిహర వీర మల్లు సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్, రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు.
రాక్‌స్టార్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నర్గిస్.. త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఆమె టట్లూబాజ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఓటీటీలు అంటేనే అసలు హద్దులు లేని శృంగారానికి కేరాఫ్ గా మారిపోయాయి. దీంతో నర్గిస్ ముందు జాగ్రత్తగా ఓటీటీల విషయంలో తాను కొన్ని పరిమితులు విధించుకున్నట్లు చెప్పడం విశేషం.
నగ్నంగా నటించబోనని, అలా నటించడానికి తనకు సమస్య ఉందని ఆమె చెప్పింది. తాను చేసేది నటన కాబట్టి.. హోమోసెక్సువల్ క్యారెక్టర్ అయినా సరే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.