Nagarjuna Praises on Samantha Tamil Movie: సమంత తమిళ సినిమాపై నాగార్జున ప్రశంసలు
Nagarjuna Praises Samantha Tamil Movie: కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమాను తెలుగులో నాగార్జున రిలీజ్ చేస్తున్నాడు. అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో సమంత నటించిన తమిళ సినిమా ఇరుంబుతిరైపై నాగార్జున ప్రశంసలు కురిపించాడు.
Nagarjuna Praises Samantha Tamil Movie: సమంత హీరోయిన్‌గా నటించిన తమిళ సినిమాపై నాగార్జున ప్రశంసలు కురిపించాడు. సర్దార్ (Sardar) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విశాల్ (Vishal), సమంత జంటగా 2018లో తమిళంలో విడుదలైన ఇరుంబుతిరై పెద్ద విజయాన్ని సాధించింది.
తెలుగులో అభిమన్యుడు పేరుతో డబ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇరుంబుతిరై సినిమాకు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా మిత్రన్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.
సర్ధార్ సినిమాను తెలుగులో నాగార్జున Nagarjuna) రిలీజ్ చేస్తున్నాడు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాగార్జున గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో మిత్రన్ గతంలో తెరకెక్కించిన ఇరుంబు తిరై సినిమాను చూశానని, తెలుగులో అభిమన్యుడిగా రిలీజైన ఈ సినిమా తనకు బాగా నచ్చిందని అన్నాడు. సర్ధార్ కూడా ఇరుంబుతిరై కంటే పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.
ఇరుంబుతిరైలో నటీనటులు గురించి ఆయన మాట్లాడలేదు. ది ఘోస్ట్ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచింది.
యాక్షన్ అంశాలకు పేరొచ్చినా ఎమోషన్స్ మిస్ కావడంతో ఫెయిల్యూర్‌గా నిలిచింది. ప్రస్తుతం గాడ్‌ఫాదర్ దర్శకుడు మోహన్‌రాజాతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు నాగార్జున. ఈ సినిమాలో అఖిల్ మరో హీరోగా నటిస్తున్నాడు. నాగార్జున, అఖిల్ నటించనున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.