Manchu Lakshmi Adhi Parvam: ఆదిపర్వం ఫస్ట్‌లుక్ రిలీజ్ - ఇది మంచు లక్ష్మి అరుంధతి
Manchu Lakshmi Adhi Parvam: మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆదిపర్వం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. సోషియా ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నాడు.
Manchu Lakshmi Adhi Parvam: అమ్మోరు, అరుంధతి తరహాలో సోషియో ఫాంటసీ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది మంచు లక్ష్మి. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఆదిపర్వం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పవర్‌ఫుల్ లుక్‌లో మంచు లక్ష్మి కనిపిస్తోంది. 1974 - 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రగుడి అమ్మవారి నేపథ్యంలో దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం చుట్టూ సాగే ఈ కథలో మంచు లక్ష్మి పాత్ర ఆమె కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇదివరకు చేయనటువంటి డిఫరెంట్ రోల్‌లో మంచు లక్ష్మి కనిపిస్తుందని, ఆమెపై చిత్రీకరించిన రెండు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అంతర్లీనంగా అందమైన ప్రేమకథ ఉంటుందని దర్శకుడు పేర్కొన్నాడు.
ఈ సినిమాలో మంచు లక్ష్మితో పాటు ఆదిత్యం ఓం, ఎస్తేర్, సుహాసిని మణిరత్నం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.