Vijay Deverakonda: లైగర్ నుంచి మరో పాట సిద్ధం.. విజయ్- అనన్య కెమిస్ట్రీ అదుర్స్-liger new song aafat song promo out and the full song will out tomorrow ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: లైగర్ నుంచి మరో పాట సిద్ధం.. విజయ్- అనన్య కెమిస్ట్రీ అదుర్స్

Vijay Deverakonda: లైగర్ నుంచి మరో పాట సిద్ధం.. విజయ్- అనన్య కెమిస్ట్రీ అదుర్స్

Maragani Govardhan HT Telugu
Aug 04, 2022 04:24 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమాలో మరో సాంగ్ విడుదల కాకుంది. ఆఫత్ అనే రొమాంటిక్ పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సంసిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

<p>విజయ్ దేవరకొండ, అనన్యా పాండే</p>
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే (Twitter)

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్‌గా చేసింది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయింది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ, వాట్ లగా దేంఘే లాంటి సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. అందుకే మరో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఆఫత్ అనే సాంగ్‌ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని చిత్ర హీరో విజయ్ దేవరకొండ తన ట్విటర్ వేదిక ద్వారా తెలియజేశాడు. తల్లి, కొడుకుల మధ్య ఎల్లప్పుడూ అందమైన డ్రామా క్వీన్ ఉంటుంది. ఆఫత్ సాంగ్ రేపు ఉదయం 4 గంటలకు విడుదల కానుంది. అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు మన రౌడీ హీరో.

అక్డీ పక్డీ, వాట్ లగా దేంఘే లాంటి సాంగ్స్ మాదిరిగా కాకుండా ఇది రొమాంటిక్ సాంగ్‌గా సాగనుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మాస్, కుర్రకారును ఉర్రూతలూగించగా.. ఆఫత్ మాత్రం రొమాంటిక్ మెలోడీగా సాగనుంది. లిరికల్ సాంగ్ రూపంలో ఈ పాటను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది.

ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్‌ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించనుంది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్‌ పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో విడుదలకానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం