Kota Factory season 3 OTT Release Date: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ కావాలా.. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి-kota factory season 3 ott release date netflix teases the date with a twist see the video here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kota Factory Season 3 Ott Release Date: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ కావాలా.. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి

Kota Factory season 3 OTT Release Date: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ కావాలా.. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి

Hari Prasad S HT Telugu

Kota Factory season 3 OTT Release Date: కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేస్తోంది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ పై గురువారం (మే 30) నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియో రిలీజ్ చేస్తూ పెద్ద ట్విస్టే ఇచ్చింది.

కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ కావాలా.. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి

Kota Factory season 3 OTT Release Date: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ సీజన్ 3 జూన్ లోనే వచ్చేస్తోంది. అయితే పక్కా డేట్ తెలియాలంటే మాత్రం మీ మెదడుకు పని చెప్పాల్సిందే. పంచాయత్ సీజన్ 3 రిలీజ్ డేట్ ను రివీల్ చేయడానికి ప్రైమ్ వీడియో ఎలా ఊరించిందో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా అదే పని చేస్తోంది.

కోటా ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్

కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 రిలీజ్ డేట్ ను రివీల్ చేయడానికి గురువారం (మే 30) నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో షోలోని పాపులర్ క్యారెక్టర్ జీతూ భయ్యా కనిపించాడు. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ఎప్పుడొస్తుందని తెగ అడిగేస్తున్నారట.. జూన్ లోనే వచ్చేస్తోంది.. అయితే ఏ తేదీన వస్తుందన్నది మాత్రం అంత సులువుగా చెప్పను.. బోర్డుపైన ఓ ప్రశ్న ఉంది.. దానిని పరిష్కరిస్తే తేదీ వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు.

తీరా బోర్డుపై ఉన్న ప్రశ్న చూస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే. మ్యాథ్స్ అంటే అస్సలు పడని స్టూడెంట్స్ దీని జోలికి వెళ్లకండి. చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. అయితే ఇలాంటి వాటిని పరిష్కరించడానికి ఆసక్తి చూపే వాళ్లు మాత్రం అప్పుడే పని మొదలు పెట్టారు. సర్‌ప్రైజ్ టెస్ట్ అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ వీడియోను రిలీజ్ చేసింది.

దీనికి సమాధానం ఇదేనా?

జీతూ భయ్యా పెట్టిన టెస్ట్ కాస్త కఠినమే అయినా.. మ్యాథ్స్ స్టూడెంట్ కు మాత్రం ఇది సులువే. దీనిని పరిష్కరించిన కొందరు నెటిజన్లు.. జూన్ 20 అని తేల్చేశారు. ఇదే కరెక్ట్ ఆన్సర్ అని మరో యూజర్ స్పష్టం చేశాడు. కొందరు జూన్ 15, జూన్ 28లాంటి తేదీలు కూడా చెప్పినా.. అవన్నీ తప్పుడు సమాధానాలని సదరు యూజర్ తేల్చేశాడు.

ఈ కోటా ఫ్యాక్టరీలో పాపులర్ జీతూ భయ్యా పాత్రను జితేంద్ర కుమార్ పోషించాడు. ఈ మధ్యే అతని మరో మచ్ అవేటెడ్ వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3 కూడా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండు నెలల్లో జితేంద్ర కుమార్ రెండు ధమాకాలు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మొత్తానికి జూన్ లోనే కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 రానుంది. ఫ్యాన్స్ గెస్ చేసినట్లు అది జూన్ 20 అని నెట్‌ఫ్లిక్స్ కన్ఫమ్ చేయాల్సి ఉంది.

కోటా ఫ్యాక్టరీ స్టోరీ ఏంటి?

కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ ను ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) తెరకెక్కించింది. ఇది ఐఐటీ ఆస్పిరెంట్స్ చుట్టూ తిరిగే కథ. రాజస్థాన్ లోని కోటా ఈ ఐఐటీ కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ)కి పేరు పొందింది. అయితే అక్కడి కోచింగ్, ర్యాంకుల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే స్టూడెంట్స్ కూడా చాలా మందే ఉన్నారు.

ఇదే ప్రధాన కథగా కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. 2019లో తొలి సీజన్ రాగా.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మూడో సీజన్ రాబోతోంది. అద్భుతమైన వెబ్ సిరీస్ లు అందిస్తుందని పేరున్న టీవీఎఫ్ నుంచి ఇప్పటికే పంచాయత్ 3, గుల్లక్ 3 వెబ్ సిరీస్ రాగా.. ఇప్పుడు కోటా ఫ్యాక్టరీ కూడా రానుంది.