Tollywood | 'బాగా కావాలసినవాడినే' అంటోన్న కిరణ్ అబ్బవరం.. కొత్త లుక్ అదుర్స్-kiran abbavaram new movie nenu meeku baga kavalsinavadini poster release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood | 'బాగా కావాలసినవాడినే' అంటోన్న కిరణ్ అబ్బవరం.. కొత్త లుక్ అదుర్స్

Tollywood | 'బాగా కావాలసినవాడినే' అంటోన్న కిరణ్ అబ్బవరం.. కొత్త లుక్ అదుర్స్

HT Telugu Desk HT Telugu
Feb 23, 2022 12:40 PM IST

ఎస్ఆర్ కల్యాణమండపం పేమ్ కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. తాజాగా చిత్రబృందం కిరణ్ స్టిల్ ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ కుమార్తే కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం (Feed)

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు దివంగత శ్రీ కోడి రామ‌కృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా అడుగుపెట్టారు. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో కార్తిక్ శంక‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం ఫేమ్ కిరణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో కిరణ్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

లవర్ బాయ్ లుక్‌లో కిరణ్‌ను చూసిన ప్రేక్షకులు తాజాగా ఒకేసారి మాస్ కమర్షియల్ లుక్‌లో కనిపించేసరికి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. తెలుగు సినిమా ద‌ర్శ‌క దిగ్గజాల్లో ఒకరైన కోడి రామ‌కృష్ణ సమ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి 'నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.

కోడి రామ‌కృష్ణ  చిత్రాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే బాగా కావాల్సినవాడిని అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీంతో కుటుంబ ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం మరింత దగ్గరవనున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా సంజన్ ఆనంద్ నటిస్తోంది. సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా బాస్కర్, సమీర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోడి రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

IPL_Entry_Point