K.G.F: Chapter 2 | ‘కేజీఎఫ్-2’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు...
‘కేజీఎఫ్’ ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను గురువారం ప్రకటించారు. ట్రైలర్ ఎప్పుడు విడుదలకానుందంటే...
భాషాభేదాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా సగటు సినీ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ -2’ ఒకటి. యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కన్నడ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కుతున్నఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ ‘కేజీఎఫ్’ టీమ్ శుభవార్తను వినిపించింది. ఈ నెల 27న సాయంత్రం 6.40 నిమిషాలకు సినిమా ట్రైలర్‌ను విడుదలచేయబోతున్నట్లు చిత్ర యూనిట్ గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా యష్ కొత్త పోస్టర్ ను విడుదలచేశారు. గత జనవరిలో విడుదలచేసిన టీజర్ 240మిలియన్లకుపైగా వ్యూస్ ను సాధించి కొత్త రికార్డును సృష్టించింది. వరల్డ్ లో అత్యధిక వ్యూస్ లభించిన సినిమా టీజర్స్‌లో ఒకటిగా నిలిచింది. మార్చి 27న విడుదలచ్యే ట్రైలర్ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుంతో చూడాల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు. రాఖీ ఆధీనంలో ఉన్న కేజీఎఫ్ మైన్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి రాజకీయశక్తులు, మాఫియాడాన్స్ ఎలాంటి ప్లాన్ వేశారు? వారిని రాఖీ ఎలా తిప్పికొట్టాడనే కథాంశంతో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2018లో విడుదలైన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. తొలి భాగం 250 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. కన్నడ, తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లో విజయాన్ని సాధించింది. దాంతో ‘కేజీఎఫ్ -2’ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తొలుత జనవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవడంతో ఏప్రిల్ 14కు వాయిదావేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ విలన్‌గా నటిస్తున్నారు. రవీనాటాండన్ కీలక పాత్రను పోషిస్తోంది. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తోంది.