Karate Kalyani: కరాటే కళ్యాణి "మా" సభ్యత్వం రద్ధు - తనను టార్గెట్ చేశారంటూ నటి ఆగ్రహం
Karate Kalyani: దివంగత అగ్ర నటుడు ఎన్టీఆర్‌పై అభ్యంతర కామెంట్స్ చేసిన సినీ నటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది
Karate Kalyani: దిగవంత అగ్ర నటుడు ఎన్టీఆర్‌ను కించపరిచేలా కామెంట్స్ చేసిన నటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. అసోసియేషన్ నుంచి కళ్యాణిని సస్పెండ్ చేశారు. ఆమె మెంబర్‌షిప్‌ను రద్దు చేశారు.
దిగ్గజ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన అనుచిత కామెంట్స్ కారణంగానే కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తొలగించినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఖమ్మంలో ఆయన 54 అడుగుల విగ్రహాన్ని మే 28వ తేదీన ప్రతిష్టించనున్న సంగతి తెలిసిందే.
కృష్ణుడి రూపంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనుండటంపై కరాటే కళ్యాణి అభ్యంతరకర కామెంట్స్ చేసింది. విగ్రహాన్ని ప్రతిష్టించి ఎన్టీఆర్‌ను దేవుడు అని చాటే ప్రయత్నాన్ని చేస్తోన్నారని కరాటే కళ్యాణి పేర్కొన్నది.
ఎవరి మెప్పు కోసం కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారో చెప్పాలని అన్నది. ఈ విగ్రహం కారణంగా రాబోయే తరాలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని భ్రమపడే అవకాశం ఉందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
కరాటే కళ్యాణి కామెంట్స్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్‌గా తీసుకున్నది. . కరాటే కళ్యాణికి మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. ఈ వ్యాఖలపై కరాటే కళ్యాణి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కానీ ఆమె స్పందనతో సంబంధం లేకుండా అసోసియేషన్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడంలో టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
కరాటే కళ్యాణి స్పందన
తనను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. . అసోసియేషన్ లో నిజాయితీ లోపించిందని అన్నది. తనను ఎందుకు సస్పెండ్ చేశారన్నది క్లారిటీ ఇవ్వాలని కరాటే కళ్యాణి పేర్కొన్నది. ఎన్టీఆర్‌పై గతంలో చాలా మంది అనేక అభ్యంతర కామెంట్స్ చేశారని, వారందరిని వదిలిపెట్టి తనను మాత్రమే టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ అభిమానులమేనని అన్నది.
టాపిక్