Kantara Telugu Collection Day 2: రెండు రోజుల్లో 11 కోట్లు - తెలుగులో కాసుల వ‌ర్షం కురిపిస్తున్న కాంతారా-kantara telugu collection rishab shetty film collects 11 crore in two days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara Telugu Collection Rishab Shetty Film Collects 11 Crore In Two Days

Kantara Telugu Collection Day 2: రెండు రోజుల్లో 11 కోట్లు - తెలుగులో కాసుల వ‌ర్షం కురిపిస్తున్న కాంతారా

Nelki Naresh Kumar HT Telugu
Oct 17, 2022 02:29 PM IST

Kantara Telugu Collection Day 2: కాంతారా సినిమా తెలుగులో కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 11.5 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది.

రిష‌బ్ శెట్టి
రిష‌బ్ శెట్టి

Kantara Telugu Collection Day 2: క‌న్న‌డ చిత్రం కాంతారా తెలుగులో భారీ క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ప‌ది కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తొలిరోజు ఐదు కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. రెండో రోజు క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగాయి. దాదాపు ఆరు కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను రాబ‌ట్టింది. రెండో రోజుల్లోనే ఈ సినిమా 11.5 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న‌ది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 2 కోట్ల వ‌ర‌కు కాగా రెండో రోజుల్లోనే ఐదింత‌ల లాభాల్ని ఈ సినిమా తెచ్చిపెట్టింది. ఆదివారం నాడు ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాంతారా సినిమాలో హీరోగా న‌టిస్తూనే రిష‌బ్ శెట్టి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇందులో శివ అనే అట‌వీ ప్రాంతానికి చెందిన యువ‌కుడిగా అత‌డి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ స‌న్నివేశాల్లో రిష‌బ్‌ శెట్టి న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అర‌వింద్ రిలీజ్ చేశారు.

క‌న్న‌డంలో ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో స‌ప్త‌గి గౌడ‌, అచ్యుత్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్ని పోషించారు.

IPL_Entry_Point