Chandramukhi 2 Trp Rating: బుల్లితెరపై సేమ్ రిజల్ట్ - కంగనా రనౌత్ చంద్రముఖి 2కు దారుణమైన టీఆర్‌పీ రేటింగ్
Chandramukhi 2 Trp Rating: చంద్రముఖి 2 బుల్లితెరపై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు కేవలం 1.32 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.
Chandramukhi 2 Trp Rating: థియేటర్లలోనే కాదు బుల్లితెరపై కూడా చంద్రముఖి 2 డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా ఫస్ట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల జెమిని టీవీలో చంద్రముఖి 2 సినిమా టెలికాస్ట్ అయ్యింది. కంగనా రనౌత్, లారెన్స్ వంటి స్టార్స్ ఉన్నా కూడా ఈ ప్రీమియర్‌కు కేవలం 1.43 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.
అర్భన్ ఏరియాలో 1.32...అర్బన్, రూరల్ కలిసి 1.43 టీఆర్‌పీ రేటింగ్ ఈ సినిమాకు వచ్చింది. లారెన్స్ తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చిన మూవీగా చంద్రముఖి 2 నిలిచింది. లారెన్స్ గత సినిమా రుద్రుడు కమర్షియల్‌గా ఫెయిలైన కూడా టీవీ ప్రీమియర్‌కు మాత్రం 3.54 వరకు టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.
ఆ సినిమా కంటే దారుణంగా చంద్రముఖి 2కు మరి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. కంగనా రనౌత్ కెరీర్‌లో కూడా ఇదే అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకున్న మూవీగా చంద్రముఖి 2 చెత్త రికార్డును మూటగట్టుకుంది.
రజనీ మూవీకి సీక్వెల్...
చంద్రముఖి 2 సినిమాకు పి వాసు దర్శకత్వం వహించాడు. రజనీకాంత్ హీరోగా 2005తో రిలీజైన కల్ట్ క్లాసిక్ మూవీ చంద్రముఖికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 సినిమా తెరకెక్కింది. ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ పాత్రను లారెన్స్ రీప్లేస్ చేశాడు. కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించనుండటంతో ఈ సీక్వెల్‌పై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ పేలవమైన కథ, కథనాలు, గ్రాఫిక్స్ కారణంగా ఫస్ట్ పార్ట్ మ్యాజిక్‌ను సీక్వెల్ కంటిన్యూ చేయలేకపోయింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కంగనా యాక్టింగ్‌పై విమర్శలొచ్చాయి.
30 కోట్లు లాస్...
దాదాపు అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చంద్రముఖి 2 మూవీ థియేట్రికల్ రన్‌లో కేవలం 30 కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళంలో ఓ మోస్తారు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిలా పడింది. ఐదు కోట్ల లోపే కలెక్షన్స్ సాధించింది. తెలుగులో భారీగానే ఈ సినిమాను ప్రమోట్ చేసినా ఫలితం మాత్రం దక్కలేదు.
చంద్రముఖి 2 కథ ఇదే...
తమ కుటుంబానికి ఎదురవుతోన్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు రంగనాయకి ఫ్యామిలీ వేటయ్యపాలెం వస్తుంది. చంద్రముఖి ప్యాలెస్‌లో కొన్నాళ్లు ఉండాలని ఫిక్స్ అవుతారు. ఆ ప్యాలెస్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? 17 ఏళ్ల క్రితం బయటకు వెళ్లిన చంద్రముఖి 2 ఆత్మ తిరిగి వచ్చి రంగనాయకి కుటుంబంలోని ఎవరిని ఆవహించింది? 200 ఏళ్ల క్రితం చనిపోయిన వేటయ్య రాజు రాజుపై పగ తీర్చుకోవాలని ఎందుకు అనుకుంది? రంగనాయకి ఫ్యామిలీని మదన్ (లారెన్స్) ఎలా సేవ్ చేశాడు? అన్నదే ఈ మూవీ కథ. ఇందులో మదన్‌గా, వేటయ్యరాజుగా లారెన్స్ డ్యూయల్ రోల్‌లో నటించాడు.
చంద్రముఖి 2 సినిమాలో లారెన్స్, కంగనా రనౌత్‌తో పాటు లక్ష్మీమీనన్, మహిమా నంబియార్, రాధిక కీలక పాత్రలు పోషించారు. వడివేలు కమెడియన్‌గా కనిపించాడు. చంద్రముఖి 2 మూవీకి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించాడు.