IMDb Most Popular Indian Stars: ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 వీళ్లే.. రామ్ చరణ్ స్థానం ఇదీ-imdb most popular indian stars list is here shah rukh khan tops ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Imdb Most Popular Indian Stars: ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 వీళ్లే.. రామ్ చరణ్ స్థానం ఇదీ

IMDb Most Popular Indian Stars: ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 వీళ్లే.. రామ్ చరణ్ స్థానం ఇదీ

Hari Prasad S HT Telugu
Nov 22, 2023 02:41 PM IST

IMDb Most Popular Indian Stars: ఐఎండీబీ ప్రతీ ఏడాదిలాగే 2023కు కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో రామ్ చరణ్ ఏకంగా 31వ స్థానంలో నిలవడం విశేషం.

ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలో తొలి స్థానంలో ఉన్న షారుక్ ఖాన్
ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలో తొలి స్థానంలో ఉన్న షారుక్ ఖాన్

IMDb Most Popular Indian Stars: ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) బుధవారం (నవంబర్ 22) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్ అనౌన్స్ చేసింది. ప్రతి నెలా ఈ వెబ్‌సైట్ వచ్చే సుమారు 20 కోట్ల మంది యూజర్లు విజిట్ చేసిన రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేశారు. ప్రతి ఏడాది ఈ పాపులర్ స్టార్స్ లిస్ట్ విడుదల చేస్తారు.

ఈ ఏడాది ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తొలి స్థానంలో నిలవడం విశేషం. 2023లో అతడు నటించిన పఠాన్, జవాన్ మూవీస్ ఏకంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఊహించినట్లు కింగ్ ఖాన్ టాప్ లో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సినిమాలు కలిపి రూ.2200 కోట్లు వసూలు చేశాయి.

రామ్ చరణ్ స్థానం ఎక్కడంటే?

గతేడాది టాప్ 10 జాబితాకు ఈసారి జాబితాకు అసలు పొంతనే లేదు. 2022లో టాప్ 10లో రామ్ చరణ్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ స్టార్లు ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఒక్క టాలీవుడ్ నటుడు కూడా దీనికి దరిదాపుల్లో లేడు. రామ్ చరణ్ ఈసారి 31వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక టాప్ 10లో మొత్తంగా కేవలం ముగ్గురు సౌత్ స్టార్స్ కే చోటు దక్కింది.

తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి ఈ టాప్ 10లో ఉన్నారు. వీళ్లు కూడా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ హవాతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2023లో తమన్నాతోపాటు విజయ్ సేతుపతి కూడా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్నారు. అటు నయనతార.. షారుక్ తో కలిసి జవాన్ లో నటించిన విషయం తెలిసిందే. నయనతార 5, తమన్నా 6, విజయ్ సేతుపతి 10వ స్థానాల్లో ఉన్నారు.

ఐఎండీబీ టాప్ 10 పాపులర్ స్టార్స్ వీళ్లే

షారుక్ ఖాన్

ఆలియా భట్

దీపికా పదుకోన్

వామికా గబ్బి

నయనతార

తమన్నా భాటియా

కరీనా కపూర్ ఖాన్

శోభితా దూళిపాళ్ల

అక్షయ్ కుమార్

విజయ్ సేతుపతి