Virata Parvam: వరంగల్‌కి వస్తే నా ఇంటికి వచ్చినట్లే ఉంటుంది: సాయి పల్లవి
లేడీ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న సాయిపల్లవి త్వరలోనే విరాట పర్వంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శుక్రవారం సినిమా రిలీజ్‌కానున్న నేపథ్యంలో వరంగల్‌లో ఆత్మీయ వేడుక ఏర్పాటు చేశారు.
తన డ్యాన్స్‌తో, సహజమైన హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సాయి పల్లవి. పాత్ర ఏదైనా అందులో జీవించేస్తుంది. అలాంటి సాయి పల్లవి హీరోయిన్ ఓరియెంటెడ్ స్టోరీ అయిన విరాట పర్వంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 17 మూవీ రిలీజ్ కానుండగా.. ఆదివారం వరంగల్‌లో ఆత్మీయ వేడుక పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఇందులో ఆమె మాట్లాడుతూ.. వరంగల్‌కు ఎప్పుడు వచ్చినా తన ఇంటికి వచ్చినట్లే ఉంటుంది అని అనడం విశేషం. "కళ లేకుండా మేము లేము. మేము లేకుండా కళ లేదు. ఇప్పుడు ఆ కళ ద్వారా వరంగల్‌కు చెందిన ఓ నిజాయతీ గల స్టోరీని మేము సినిమాగా చేశాం. ఇది మన సినిమా. మీరు ఈ సినిమాను కచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మీరు ప్రోత్సహిస్తేనే ఇలాంటి ప్రయత్నాలు చేయగలం" అని సాయిపల్లవి చెప్పింది.
వరంగల్ ప్రజల ఆశీర్వాదాలు తమపై ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ లవ్‌స్టోరీ ఇది. రానా దగ్గుబాటి తొలిసారి ఇలాంటి స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఆత్మీయ వేడుకలో పాల్గొన్న హీరో రానా మాట్లాడుతూ.. ఈ సినిమా ఎందుకు చేస్తున్నావని తనను చాలా మంది అడిగినట్లు చెప్పాడు.
"ఈ సినిమా చేస్తున్న సమయంలో ఒక యాక్షన్ మూవీ చేయకుండా ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగారు. సాధారణంగా హీరోలు ఫ్యాన్స్ కోసం, చప్పట్ల కోసం సినిమాలు తీస్తారు. కానీ ఈ సినిమా మాత్రం ఓ నిజాయతీ గల కథతో కూడిన సినిమా కోసం చూస్తున్న వారి కోసం చేశాను. సక్సెస్ మీట్ సమయంలో మనమందరం మళ్లీ ఇక్కడే కలుద్దాం" అని రానా అన్నాడు. నీది నాది ఒకే కథ సినిమా ఫేమ్ వేణు ఉడుగుల ఈ మూవీకి డైరెక్టర్.
సంబంధిత కథనం
టాపిక్