Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు! కన్నీళ్లతో తల్లిదండ్రులు-high court lawyer about bigg boss 7 telugu winner pallavi prashanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు! కన్నీళ్లతో తల్లిదండ్రులు

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు! కన్నీళ్లతో తల్లిదండ్రులు

Sanjiv Kumar HT Telugu
Dec 20, 2023 01:21 PM IST

Bigg Boss Winner Pallavi Prashanth Parents: బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రుల తరఫున న్యాయవాది తెలిపారు.

పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు, కన్నీళ్లతో తల్లిదండ్రులు
పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు, కన్నీళ్లతో తల్లిదండ్రులు

Pallavi Prashanth CM Revanth Reddy: బిగ్ బాస్ 7 తెలుగు న్యూసెన్స్ కేస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావొద్దని పోలీసులు, బిగ్ బాస్ నిర్వాహకులు ఆదేశించిన విన్నర్ పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ జీప్‌లో రావడంపై కేసు నమోదు అయింది. దీంతో విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ పరారీ అయ్యాడు. ప్రశాంత్ కోసం పోలీలులు 3 బృందాలుగా వెతుకుతున్నారు.

కక్ష సాధింపు చర్యలు

ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడంతో అతని తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు కంగారుపడిపోయారు. ప్రశాంత్ కేసు విషయమై అతని తల్లిదండ్రులతో కలిసి హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేష్ మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కక్ష సాధింపు చర్యలు తగవని లాయర్ రాజేష్ అన్నారు.

ఇదేనా గౌరవం

"హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతో కేసు నమోదు అయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్‌లైన్‌లో పెట్టలేదు. అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రశాంత్‌తోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా?" అంటూ ప్రశ్నించారు న్యాయవాది రాజేష్.

ముఖ్యమంత్రికి ఫిర్యాదు

"ప్రశాంత్ విన్నర్‌గా గెలవడం ఇష్టంలేని కొన్ని శక్తులు నగరంలో జరిగిన సంఘటనలకు కారణమనే అనుమానం నెలకొంది. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. చట్టప్రకారం పోలీసులు వెళ్తే తాము అడ్డుపడబోమని, కానీ, ప్రశాంత్‌పై కేసు నమోదు చేసినట్లయితే వెంటనే పోలీసు శాఖ వెబ్‌సైట్‌లో ఎఫ్ఐఆర్ పెట్టాలి. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం" అని ఆయన అన్నారు.

తల్లిదండ్రుల కంటతడి

పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన ఆనందాన్ని కోల్పోయి.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకుని.. ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోందని, అతనికి అండగా ఉంటూ న్యాయ సహాయం అందిస్తానని లాయర్ రాజేష్ పేర్కొన్నారు. తమ కొడుకుపై కక్ష సాధిస్తున్నారని మీడియా సమావేశంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు సత్యనారాయణ, విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు.

అండగా నిలవాలి

"చిన్నప్పటి నుంచి ప్రశాంత్ ఎంతోకష్టపడి చివరికీ తాను అనుకున్నది సాధించాడు. కానీ, ఈ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదు. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మాకు అండగా నిలవాలి" అని ప్రశాంత్ తల్లిదండ్రులు సత్యనారాయణ, విజయమ్మ కోరారు.

Whats_app_banner