Nithiin -Jp Nadda: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో హీరో నితిన్ భేటీ-hero nithiin meets bjp national president jp nadda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithiin -Jp Nadda: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో హీరో నితిన్ భేటీ

Nithiin -Jp Nadda: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో హీరో నితిన్ భేటీ

HT Telugu Desk HT Telugu
Aug 27, 2022 11:10 PM IST

Nithiin Meets Jp Nadda: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో హీరో నితిన్ శ‌నివారం స‌మావేశ‌మ‌య్యారు. వీరిద్ద‌రి భేటీ సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నితిన్, జేపీ న‌డ్డా
నితిన్, జేపీ న‌డ్డా (Twitter)

Nithiin Meets Jp Nadda: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో హీరో నితిన్ భేటీ అయ్యాడు. శ‌నివారం తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన జేపీ న‌డ్డా ప‌లువురు సినీ, క్రీడాప్ర‌ముఖుల‌ను క‌లిశారు. వారిలో హీరో నితిన్ కూడా ఉన్నాడు. నితిన్ తో స‌మావేశ‌మైన విష‌యాన్ని జేపీ న‌డ్డా ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. నితిన్ ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని జేపీ న‌డ్డా అన్నారు. తెలంగాణ రాజ‌కీయాల‌తో పాటు ఇక్క‌డి సామాజిక‌,సాంస్కృతిక అంశాల గురించి తమ మధ్య చర్చ జరిగిందని జేపీ న‌డ్డా తెలిపారు.

త‌న అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్ గురించి నితిన్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని త‌న‌తో పంచుకున్నాడ‌ని జేపీ న‌డ్డా చెప్పాడు. ఆ సినిమాల‌న్నీ విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లుగా ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కెరీర్ ఆరంభం నుంచి రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్న నితిన్ తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడితో స‌మావేశం కావ‌డం సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌లే ఎన్టీఆర్‌ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా క‌లిశారు. ఈ స‌మావేశం ముగిసిన కొద్ది రోజుల్లోనే నితిన్‌ను జేపీ న‌డ్డా క‌ల‌వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కార్తికేయ 2 స‌క్సెస్ మీట్‌కు నితిన్ గ‌ఢ్కారి

నిఖిల్ హీరోగా న‌టించిన కార్తికేయ 2 చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. ఈ చిత్ర యూనిట్‌ను కేంద్ర మంత్రి నితిన్ గ‌ఢ్కారి ప్ర‌త్యేకంగా అభినందించ‌బోతున్న‌ట్లు తెలిసింది. సెప్టెంబ‌ర్ 2న హైద‌రాబాద్ రానున్న గ‌ఢ్కారి నిఖిల్ తో పాటు చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో భేటీ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

IPL_Entry_Point