Nani: అంటే సుందరానికి బాక్సాఫీస్ హిట్టా కాదా అన్నది కాలమే చెబుతుంది... రిజల్ట్ పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు..-hero nani interesting comments on ante sundaraniki box office result ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani: అంటే సుందరానికి బాక్సాఫీస్ హిట్టా కాదా అన్నది కాలమే చెబుతుంది... రిజల్ట్ పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

Nani: అంటే సుందరానికి బాక్సాఫీస్ హిట్టా కాదా అన్నది కాలమే చెబుతుంది... రిజల్ట్ పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

Nelki Naresh Kumar HT Telugu
Jun 13, 2022 04:07 PM IST

నాని హీరోగా న‌టించిన అంటే సుంద‌రానికి చిత్రం మౌత్ టాక్ బాగున్నా క‌లెక్ష‌న్స్ రేసులో వెనుక‌బ‌డిపోయిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మూడు రోజుల్లో కేవ‌లం ప‌ది కోట్ల షేర్‌ను మాత్ర‌మే ఈ సినిమా రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తాజాగా సోమ‌వారం జ‌రిగిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ వేడుక‌లో అంటే సుంద‌రానికి రిజ‌ల్ట్ పై నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు...

<p>నజ్రియా నజీమ్, నాని</p>
నజ్రియా నజీమ్, నాని (twitter)

అంటే సుంద‌రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుందా లేదా అన్న‌ది కాల‌మే చెబుతుంద‌ని అన్నాడు హీరో నాని. సోమ‌వారం అంటే సుంద‌రానికి బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ వేడుక‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో సినిమా రిజ‌ల్ట్ తో పాటు కలెక్షన్స్ పై  హీరో నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

నాని  మాట్లాడుతూ ‘అంటే సుంద‌రానికి  రిలీజ్ అయ్యి మూడు రోజులే అయ్యింది అప్పుడే బ్లాక్‌బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఏంటి అని అంద‌రూ అనుకోవ‌చ్చు. కానీ ఈ రోజు మేము సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ది నంబ‌ర్స్ ను కాదు.. ఎంత మంది మ‌న‌సుల్ని ఈ సినిమా గెలుచుకున్న‌ది...ఎంత ప్రేమ ద‌క్కింది. సినిమా చూసిన వారు ఎంత ఎంజాయ్ చేస్తున్నార‌నే దానిని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.  అంటే సుంద‌రానికి సినిమా బాక్సాఫీస్ బ్లాక్‌బ‌స్టర్ గా నిలుస్తుందా లేదా అన్న‌ది టైమ్ చెబుతుంద‌ని నాని పేర్కొన్నాడు. ఆ విష‌యాన్ని కాలానికే వ‌దిలివేస్తున్నాన‌ని చెప్పాడు.  సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుల క‌ళ్ల‌ల్లో ఆనందం, ప్రేమ విష‌యంలో తాము బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన‌ట్లుగా చెప్పాడు. రెగ్యుల‌ర్ ట్రెండ్ ను బ్రేక్ చేస్తూ నిజాయితీగా క‌థ చెబుతూ కొత్త ఫ్లేవ‌ర్ ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన సినిమాల‌ను మిగ‌తా వాటితో కంపేర్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని నాని అన్నాడు.   త‌న గత హిట్ సినిమాల‌తో లేదా మైత్రీ మూవీస్ చేస్తున్న మిగిలిన చిత్రాల‌తో అంటే సుంద‌రానికి సినిమాను పోల్చ‌వ‌ద్ద‌ని పేర్కొన్నాడు. నాని చేసిన వ్యాఖ్య‌లు తెలుగు చిత్ర‌సీమ‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా మౌత్‌టాక్ బాగున్నా వ‌సూళ్ల మాత్రం పెద్ద‌గా రావ‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మూడు రోజుల్లో కేవ‌లం ప‌ది కోట్ల షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలిసింది. నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ సేవ్ కావాలంటే ఇంకా ప‌దిహేను కోట్లు రావాల్సి ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చూస్తుంటే సినిమా లాభాల బాట ప‌ట్ట‌డం క‌ష్ట‌మ‌నే చెబుతున్నారు. ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాతో న‌జ్రియా న‌జీమ్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. 

Whats_app_banner

సంబంధిత కథనం