Rajinikanth Jailer Update: 'జైలర్' సెట్స్‌లో రజినీ సందడి.. మేకింగ్ వీడియో విడుదల
Rajinikanth Jailer Update: నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్ జైలర్ అనే చిత్రం సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమా మేకింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Rajinikanth Jailer Update: సూపర్‌స్టార్ రజినీకాంత్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఏడు పదుల వయస్సులోనూ ఆయన తనదైన స్టైల్, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది వచ్చిన పెద్దన్న చిత్రంలో చివరిగా కనిపించిన సూపర్‌స్టార్.. ఆ తర్వాత కాస్త్ గ్యాప్ తీసుకున్నారు. ఇటీవలే జైలర్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో రజినీకాంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఇప్పటికే జైలర్ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాగా.. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో రజినీకాంత్ సందడి చేసిన వీడియోను విడుదల చేశారు. ఈ విషయాన్ని జైలర్ మూవీని నిర్మిస్తున్న సన్‌పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ఈ వీడియోను గమనిస్తే రజినీని పూర్తిగా చూపించరు.. నీడలో చూపిస్తారు. వరుసగా సినిమాకు సంబంధించిన మేకింగ్ షాట్లు చూపిస్తారు. అక్కడక్కడ రజినీ షాడో రూపం కనిపిస్తూ ఉంటుంది. చివర్లో రజినీ కూర్చీ మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న షాట్‌తో ఈ మేకింగ్ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ చిత్రంపై విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ చిత్రానికి డాక్టర్, బీస్ట్ లాంటి సినిమాలను తెరకెక్కించిన నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో రజినీకాంత్‌తో పాటు శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, వాసంతి రవి తదితర భారీ తారాగణం నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
సంబంధిత కథనం