Did You Know: రంగీలాలో రజినీకాంత్, నాగార్జున, శ్రీదేవి.. ఏ రేంజ్ లో ఉండేదో?-rajinikanth nagarjuna and sridevi were the first choices in rangeela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajinikanth Nagarjuna And Sridevi Were The First Choices In Rangeela

Did You Know: రంగీలాలో రజినీకాంత్, నాగార్జున, శ్రీదేవి.. ఏ రేంజ్ లో ఉండేదో?

Maragani Govardhan HT Telugu
Nov 25, 2021 03:08 PM IST

అమీర్ ఖాన్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన రంగీలా 1995లో విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది ఈ సినిమా. అయితే ఈ చిత్రంలో మొదట ప్రధాన పాత్రలుగా అమీర్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ కాదట.

రజినీ కాంత్
రజినీ కాంత్ (Hindustan times)

రామ్ గోపాల్ వర్మకు తెలుగులోనే కాదు బాలివుడ్ లోనూ సంచలన దర్శకుడిగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలకు ఆర్జీవీ పెట్టింది పేరు. ఆయన తీసిన శివ, క్షణ క్షణం, గాయం, రంగీలా లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయనను దిగ్గజ దర్శకుల సరసన నిలుచేలా చేశాయి. ముఖ్యంగా రంగీలా చిత్రం బాలివుడ్ సినీ దృక్కోణాన్ని మార్చివేసింది. కేవలం అక్కడే కాదు తెలుగులోనూ డబ్ అయి పాన్ ఇండియా హిట్ అయింది. అమీర్ ఖాన్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన రంగీలా 1995లో విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది ఈ సినిమా. అయితే ఈ చిత్రంలో మొదట ప్రధాన పాత్రలుగా అమీర్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ కాదట. రామ్ గోపాల్ వర్మ కథ రాసినప్పుడు ఈ స్టోరీని రజినీకాంత్, నాగార్జున, శ్రీదేవితో తీయాలనుకున్నాడట. అవును ఈ విషయాన్ని ఈ చిత్రంలో నటించిన ఊర్మిళా మటోండ్కరే ఓ సందర్భంలో తెలిపింది.

రంగీలా చిత్రం కోసం మొదట రజినీకాంత్, శ్రీదేవి, నాగార్జునను ఆర్జీవీ సంప్రదించారని ఆమె చెప్పింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ముగ్గురు సినిమా నుంచి వైదొలిగారని, అనంతరం ఆ అవకాశం మా వద్దకు వచ్చిందని స్పష్టం చేసింది. డేట్స్ సమస్యతో ముందుగా రజినీ వైదొలిగారని, అనంతరం శ్రీదేవి, నాగార్జున నో చెప్పారని చెప్పింది. చివరకు పాత్రలకు అనుగుణంగా తమను తీసుకున్నట్లు ఊర్మిళా తెలిపింది.

అన్ని కుదిరినట్లయితే రంగీలా రజినీకాంత్, శ్రీదేవి, నాగార్జును ఒక తెరపై చూసేవాళ్లం. ఆ ముగ్గురు ఈ సినిమాకు పర్ఫెక్టుగా సరిపోతారు కూడా. ఈ ముగ్గురు స్టార్లు లేనప్పటికీ అమీర్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ తమ అభినయంతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించిందీ చిత్రం. ముఖ్యంగా హిందీ సినిమా ఫ్యాషన్ పోకడలను మార్చింది. ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుకు శ్రీకారం చుట్టింది. ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఈ సినిమాతో తొలి ఫిల్మ్ ఫేర్ ను అందుకున్నారు. ఆ సంవత్సరం ఈ చిత్రానికి మొత్తం 7 ఫిల్మ్ ఫేర్లు దక్కాయి. ఏఆర్ రెహ్మాన్ తన సంగీతంతో యావత్ దేశాన్ని మైమరిపించాడు. ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ దక్కించుకున్నారు. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వర్మ క్రియేషన్స్ బ్యానర్ పై నీరజ్ వోరా, రామ్ గోపాల్ వర్మ నిర్మించారు.

IPL_Entry_Point