Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి డైరెక్టర్ ఔట్? - పుకార్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాను తప్పుకొన్నట్లు వస్తోన్న వార్తలపై దర్శకుడు హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. ఈ పుకార్లపై అతడు ఏమన్నాడంటే...
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్ తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తోన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండటమే హరీష్ శంకర్ ఈ సినిమా నుంచి వైదొలగడానికి కారణమంటూ పుకార్లు షికారు చేస్తోన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ స్థానంలో రవితేజతో హరీష్ శంకర్ ఓ మూవీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై హరీష్ శంకర్ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తాను తప్పుకోవడం, రవితేజతో సినిమా చేయబోతుండటం రెండు అబద్ధమేనని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. హరీష్ శంకర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దళపతి విజయ్ హీరోగా తమిళంలో విజయవంతమైన తేరీ మూవీ రీమేక్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. తొలుత ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు.
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం, ఏపీలో ఎన్నికలు రావడంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ యాభై శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.