Hansika Mehandi Ceremony: మెహందీ వేడుక‌ల్లో కాబోయే భ‌ర్త‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన హ‌న్సిక‌-hansika motwani mehendi ceremony video viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika Mehandi Ceremony: మెహందీ వేడుక‌ల్లో కాబోయే భ‌ర్త‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన హ‌న్సిక‌

Hansika Mehandi Ceremony: మెహందీ వేడుక‌ల్లో కాబోయే భ‌ర్త‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన హ‌న్సిక‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 02, 2022 02:09 PM IST

Hansika Mehandi Ceremony: ప్రియుడు సొహాల్ క‌తురియాతో డిసెంబ‌ర్ 4న సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ది హ‌న్సిక‌. జైపూర్‌లో హ‌న్సిక, సొహాల్‌ పెళ్లి జ‌రుగ‌నుంది. గురువారం మెహందీ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

హ‌న్సిక‌, సొహాల్ క‌తూరియా
హ‌న్సిక‌, సొహాల్ క‌తూరియా

Hansika Mehandi Ceremony: క‌థానాయిక హ‌న్సిక పెళ్లి వేడుక‌లు మొద‌ల‌య్యాయి. వ్యాపార‌వేత్త‌, చిర‌కాల మిత్రుడు సొహాల్‌ క‌తురియాతో హ‌న్సిక ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. రాజ‌స్థాన్ జైపూర్‌లోని ముందోతా ప్యాలెస్‌లో డిసెంబ‌ర్ 4న హ‌న్సిక‌, సొహాల్‌ క‌తురియా వివాహం జ‌రుగ‌నుంది. ఈ పెళ్లి వేడుక కోసం హ‌న్సిక‌, సొహాల్‌ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, స‌న్నిహితులు ఇప్ప‌టికే జైపూర్ చేరుకున్నారు.

గురువారం మెహందీ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. హ‌న్సిక మెహందీ వేడుక‌ల తాలూకు ఫొటోలు, వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వేడుక‌ల్లో రెడ్ అండ్ ఎల్లో క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి హ‌న్సిక క‌నిపిస్తోంది. ఓ వీడియోలో చేతుల‌తో పాటు కాళ్ల‌కు మెహందీ పెట్టుకొని కూర్చీలో కూర్చొని హ‌న్సిక క‌నిపిస్తోంది. ఆమె ప‌క్క‌నే సొహాల్ కూర్చున్నాడు.

ఇద్ద‌రు క‌లిసి బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. వీడియో చివ‌ర‌లో ఇద్ద‌రు చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ఈ వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. హ‌న్సిక చేతుల‌కు మెహందీ పెట్టుకున్నవీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

గ‌త వారం ముంబాయిలో బ్యాచ్‌ల‌ర్ పార్టీని ఏర్పాటుచేసింది హ‌న్సిక‌. ఈ పార్టీ తాలూకు ఫొటోలు, వీడియోల‌ను హ‌న్సిక అభిమానుల‌తో పంచుకున్న‌ది. ఈ వేడుక‌ల్లో సొహాల్‌ తో పాటు హ‌న్సిక ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ పాల్గొన్నారు. సోహ‌ల్ క‌తురియాకు ఇది రెండో వివాహం. ఆరేళ్ల క్రితం హ‌న్సిక స్నేహితురాలు రింకీ బ‌జాజ్‌ను సోహ‌ల్ పెళ్లి చేసుకున్నాడు. కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వారు విడిపోయారు.

IPL_Entry_Point