Guppedantha Manasu June 23rd Episode: కేడీ బ్యాచ్‌కు బుద్ధిచెప్పిన రిషి - జగతిని అడ్డుకోవడానికి శైలేంద్ర కొత్త స్కెచ్
Guppedantha Manasu June 23rd Episode: రేవ్ పార్టీలో పాల్గొన్న కేడీ బ్యాచ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. వారిని రిషి, వసుధార కలిసి కాపాడుతారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే..
Guppedantha Manasu June 23rd Episode: రేవ్ పార్టీలో పాల్గొన్న కేడీ బ్యాచ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. వారిపై కేసు నమోదైతే కాలేజీ పరువు పోతుందని విశ్వనాథం భయపడతాడు. వారిని విడిపించేందుకు విశ్వనాథం చేసిన ప్రయత్నాలు ఫలించవు. దాంతో ఆయన కంగారుగా రిషి సహాయం కోరుతాడు. కేడీ బ్యాచ్‌ను విడిపించేందుకు రిషి ఒక్కడే పోలీస్ స్టేషన్‌కు వెళతాడు.
అదే సమయంలో అక్కడికి వసుధార వస్తుంది. తననే ఫాలో అవుతూ వసుధార పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని భ్రమపడిన రిషి ఆమెపై ఫైర్ అవుతాడు. మీ కోసం రాలేదని, మీరు వస్తారని కూడా నాకు తెలియదని వసుధార అతడికి సమాధానమిస్తుంది. తనకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, కాలేజీ స్టూడెంట్స్ ను పోలీసులు పట్టుకున్నారని, వారిని గుర్తించడానికి రమ్మన్నారని చెబుతుంది.
ఎస్ఐతో రిషికి పరిచయం...
రిషి, వసుధార కలిసి పోలీస్ స్టేషన్‌లోపలికి వెళతారు. పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన రిషిని చూసి ఎస్ఐ ఆశ్చర్యపోతాడు. గతంలోనే అతడికి రిషితో పరిచయం ఉంటుంది. మరోవైపు రిషిని అక్కడ చూసి కేడీ బ్యాచ్ కూడా కంగారు పడతారు. తమను అతడు బుక్ చేయడం ఖాయమని వణికిపోతారు. అయితే పాండ్యన్‌తో పాటు అతడి స్నేహితులు తమ కాలేజీ స్టూడెంట్స్ అని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిపై కేసు పెట్టవద్దని ఎస్ఐని రిషి రిక్వెస్ట్ చేస్తాడు. ఈ ఒక్కసారికి వాళ్లను క్షమించి వదిలివేయమని అంటాడు. రిషి మాటను గౌరవించిన ఎస్ఐ అందుకు ఒప్పుకుంటాడు.
కేడీ బ్యాచ్ సేఫ్...
పాండ్యన్ బ్యాచ్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతాడు ఎస్ఐ. రిషి పూచీ మీద మిమ్మల్ని వదిలిపెడుతున్నానని వారితో ఎస్ఐ అంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే వసుధార క్యాబ్ బుక్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ వద్దని తాను దించేస్తానని ఆమెతో చెబుతాడు రిషి. వసుధార కార్ ముందు సీట్‌లో కూర్చోవడానికి రెడీ అవుతుంది.
ముందు సీట్‌లో వద్దని వెనుక సీట్‌లో కూర్చోమని సీరియస్‌గా ఆమెతో అంటాడు రిషి వసుధార అలాగే చేస్తుంది. బ్యాక్‌సీట్ కంఫర్ట్‌గా లేకపోయిన అడ్జెస్ట్ కావాలని, మన మధ్య ఈ సఫరేషన్ ఉండాలని చెబుతాడు. అయితే వసుధార మాత్రం పక్కపక్క సీట్‌లలో కూర్చోకపోయిన ఒక కారులో ప్రయాణం చేస్తున్నామనే ఫీలింగ్‌కే సంతోషపడుతుంది. ఏదో ఒక రోజు ముందు సీట్‌లో, మీ పక్కన కూర్చుండే రోజు వస్తుందని మనసులోనే అనుకుంటుంది.
నైట్ కాలేజీలో...
వసుధారతో పాటు పాండ్యన్ బ్యాచ్‌ను నైట్ కాలేజీకి తీసుకెళ్తాడు రిషి. తమను రిషి అక్కడకు ఎందుకు తీసుకొచ్చాడో పాండ్యన్ తో పాటు అతడి స్నేహితులకు అర్థం కాదు. అందులో చదువుకుంటున్న వారిని చూపిస్తూ పగలంతా కష్టపడుతూ రాత్రిళ్లు ఇక్కడి వారు చదువుకుంటున్నారని, ప్రతిరోజు పరిస్థితులతో యుద్ధం చేస్తూ జీవితాల్ని నెట్టుకొస్తున్నారని కేడీ బ్యాచ్‌తో చెబుతాడు రిషి. ఒక్కొక్కరిని వారికి పరిచయం చేస్తాడు. చదువు కోసం వారు పడుతోన్న కష్టాలను, చేస్తోన్న త్యాగాలను పాండ్యన్ బ్యాచ్‌కు వివరిస్తాడు రిషి.
అతడి మాటలతో పాండ్యన్ బ్యాచ్ రియలైజ్ అవుతాడు. మన చుట్టూ వాళ్లను ఇబ్బంది పెట్టడంలో కాదు, వారికి సాయం చేయడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుందని రిషి వారితో అంటాడు. చిల్లర పనులు చేస్తే భవిష్యత్తు పాడైపోతుందని సలహా ఇస్తాడు.
మిమ్మల్ని మార్చడానికి దే తన ఆఖరి ప్రయత్నమని, మీలో మార్పు వస్తే సంతోషం, రాకపోతే తాను పట్టించుకోనని, తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటానని గట్టిగా చెబుతాడు రిషి. ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకొండి అని కేడీ బ్యాచ్‌తో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి మాటలతో కేడీ బ్యాచ్ ఆలోచనలలో పడతారు.
శైలేంద్ర ప్లాన్...
కాలేజీ బోర్డ్ మీటింగ్‌లో జగతి ప్రపోజల్‌కు అడ్డుచెబుతాడు శైలేంద్ర. మిషన్ ఎడ్యుకేషన్ పోగ్రామ్ నుంచి డ్రాప్ అయిపోదామని అంటాడు. అతడి ఆలోచనా విధానాన్ని తప్పుపడుతుంది జగతి. డబ్బు కోసం కాకుండా పేద విద్యార్థులకు సాయం చేయడానికే మిషన్ ఎడ్యుకేషన్‌ను రిషి మొదలుపెట్టాడని శైలేంద్రతో అంటుంది జగతి. ఆమె మాటల్ని తేలిగ్గా తీసుకుంటాడు శైలేంద్ర.
రిషి లేడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆపేయడమే మంచిదని, దానిని సమర్థవంతంగా నడిపించే స్టాఫ్ కూడా మన కాలేజీలో లేరు ఫెయిల్యూర్ అవుతామని చెబుతాడు. అదే జరిగితే రిషి గౌరవానికి మచ్చ పడుతుందని అంటాడు.
అతడి మాటలతో ఫణీంద్ర, మహేంద్ర ఆలోచనలతో పడతారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది. రిషి మాటలతో కేడీ బ్యాచ్‌లో మార్పు వచ్చిందా? జగతిని కాలేజీ నుంచి పంపించాలనే శైలేంద్ర ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? అన్నది రేపటి గుప్పెడంత మనసు సీరియల్‌లో చూడాల్సిందే.