Guppedantha Manasu April 29th Episode: శైలేంద్ర కన్నింగ్ యాక్టింగ్ షురూ.. ధరణికి కొత్త కష్టాలు
Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనుసు నేటి ఎపిసోడ్‌లో శైలేంద్ర భూషణ్ కన్నింగ్ యాక్టింగ్ షురూ చేశాడు. ధరణిని కొత్తగా వేధించడం మొదలుపెట్టాడు. మరోపక్క జగతీ-వసు ధరణిని చూసి బాధపడుతుంటారు.
Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో వసుధారకు దేవయాని వార్నింగ్.. అందుకు ప్రతీగా వసు.. దేవయానికి రివర్స్ సెటైర్ ఇచ్చింది. అంతేకాకుండా ధరణిపై పదే పదే దేవయాని రుసరుసలాడటం, శైలేంద్ర కూడా ఆమెను అవమానించడం లాంటివి చేస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో కిచెన్‌లో ఉన్న ధరణిని జగతీ వచ్చి ఓదార్చుతుంది. టీ దేవయానికి తీసుకెళ్లడాన్ని తప్పుపడుతూ.. ఆమె ఎప్పుడు మారుతుందో అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. వారిని అర్థం చేసుకునేవరకు నాకు ఈ కష్టాలు తప్పవు అంటూ ధరణి బాధపడుతుంది. ఆమెను ఓదార్చిన జగతీ నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకో, ఎవ్వరి మీద ఆధారపడకు అని హిత బోధ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క ధరణి..శైలేంద్రకు తగినట్లుగా నడుచుకుని తన కాపురాన్ని చక్కదిద్దుకుంటానని అనుకుంటుంది.
రిషి సీట్‌కు దేవయాని ఎసరు..
సీన్ కట్ చేస్తే.. దేవయాని.. శైలేంద్ర అన్నీ కలిపి నూరిపోస్తుంటుంది. నువ్వు చాలా మేనేజ్ చేస్తున్నావ్.. ఎవ్వరికీ మనమీద అనుమానం రాకుండా చూసుకోవాలి అంటూ అతడితో అంటుంది. డోంట్ వర్రీ మమ్ నన్ను ఎవరు కనిపెట్టలేరు అంటూ శైలేంద్ర బదులిస్తాడు. అనంతరం దేవయాని మాట్లాడుతూ.. నాకో ఆశ ఉంది నాన్న.. డీబీఎస్టీ కాలేజ్‌లో మీ తాత గారి తర్వాత మీ నాన్న గారు.. ఆ తర్వాత నువ్వు కూర్చొవాలి.. కానీ అందరూ కలిసి రిషికి అప్పగించారు. ఏదోలే నామమాత్రంగా ఉంటాడనుకుంటే అతడు సామ్రాజ్యంగా మార్చాడు. దానికి చక్రవర్తిగా అవతరించాడు. అన్ని తనే శాసిస్తున్నాడు. రిషి స్థానంలో నువ్వు కూర్చొవాలి. నువ్వు కాలేజ్ ఛైర్మన్ అవ్వాలి అంటూ శైలేంద్రతో కలిసి దేవయాని అంటుంది.
నీ కోరిక తీరదు మమ్మీ.. అని శైలేంద్ర దేవయానికి షాక్ ఇస్తాడు. నేను వెళ్లి ఆ సీట్‌లో కూర్చోవడమేంటి? అందరూ కలిసి నన్నే ఆ సీట్లో కూర్చోబెట్టాలని అంటాడు. నువ్వు కోరుకో జరిగిపోతుందని, నేను ఏది అడగనని, వాళ్లంతటా వాళ్లే ఇస్తారని తనను చూసి గర్వపడతాడు. ఇందుకు దేవయానికి కూడా తెగ సంతోషపడుతుంది. నేనే అంటే నాకంటే మించిపోయావని గర్వపడుతుంది. ఇంతలో అన్నయ్య అంటూ రిషి ఎంట్రీ ఇస్తాడు. కాసేపు ఇద్దరూ షాక్ అవుతారు. కానీ రిషి వచ్చి సాధారణంగా ఉండేసరికి ఊపిరి పీల్చుకుంటారు.
రిషి వచ్చి ఇంకేంటి అన్నయ్య ఫారిన్ సంగతులు అంటూ శైలేంద్రను అడుగుతాడు. అక్కడ ఎలా ఉండేది నీ లైఫ్. ఏముంది రిషి అంతా మాములుగానే ఉండేది అంటూ శైలేంద్ర సమాధానం చెబుతాడు. అయినా నువ్వే చెప్పాలి. కాలేజ్ విషయాలు అని అడుగుతాడు. ఇందుకు రిషి.. శైలేంద్రను కాలేజ్‌కు రమ్మని ఆహ్వానిస్తాడు. ఫారిన్ వెళ్లినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అని నువ్వే చెప్పాలి అంటూ రిషి.. శైలేంద్రను కాలేజ్‌కు రమ్మంటాడు. ఇందుకు శైలేంద్ర కూడా కాదంటూనే వస్తానని అంగీకరిస్తాడు.
శైలేంద్ర యాక్టింగ్ షురూ..
అనంతరం ధరణి వంట గదిలో కూరగాయలు తరుగుతూ డల్‌గా ఉంటుంది. ఆమెను చూసిన జగతీ, వసు బాధపడతారు. శైలేంద్ర-జగతీ మధ్య సఖ్యత లేదనకుంటా అని అనుకుంటారు. ఇంతలో పక్క నుంచి వీరి మాటలను విన్న శైలేంద్ర.. నన్ను వీరందరూ గమనిస్తున్నారనుకుంటా.. నేను జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. వెంటనే ధరణి అంటూ పిలుస్తూ ఆమె వద్దకు వెళ్లి ప్రేమ నటిస్తాడు. ఆప్యాయంగా మాట్లాడినట్లు వ్యవహరిస్తాడు. అతడి ప్రవర్తనకు ధరణి షాక్ అవుతుంది. ఇదంతా వసు-జగతీ గమనిస్తుంటారు. సరదాగా నీతో గడపాలనుకుంటే.. నువ్వు ఏదోక పనిచేస్తూనే ఉంటావు.. అని కల్లబోలి కబుర్లు చెబుతుంటాడు. ఇందుకు ధరణి ఆనందపడతుంది.
రంగుల మారుస్తున్న శైలేంద్ర..
వెంటనే మాట మార్చి.. ఏంటి ధరణి ఆనందపడుతున్నావా.. నేను వచ్చిన తర్వాత అందరూ నువ్వు సంతోషంగా లేరనుకుంటారు.. కాబట్టి ఆనందంగా ఉన్నట్లు కొంచెం యాక్టింగ్ చేయమని వెంటనే తన అసలు రంగు బయటపెడతాడు. కాస్త నవ్వు ముఖం పెట్టు.. వెనక పిన్ని వాళ్లున్నారు. జాగ్రత్త అంటూ ధరణిని హెచ్చరిస్తాడు. రేపు నువ్వు ఫ్రీగా ఉంటావా, పార్క్‌కు వెళ్దామా అంటూ ధరణిని అడుగుతూనే.. మూడ్ బాగోలేదా అంటూ అందరికి వినపడేలా అతడే సమాధానమిస్తాడు. సర్లే నీ మూడ్‌ను బట్టి నేనే ఫాలో అవుతాను.. త్వరగా పని పూర్తి చేసుకుని గదిలోకి రా.. చాలా విషయాలు మాట్లాడాలి అంటూ ప్రేమ నటిస్తాడు.
వెంటనే జగతీ-వసుల వద్దకు వచ్చి.. ధరణి నాతో అంత ఫ్రీగా ఉండలేకపోతుంది. కొంచెం కలపుగోలుతనంగా ఉండమని చెప్పండి అంటూ వారితో అంటాడు. పల్లెటూరు పిల్లలా ఉంటే ఏ భర్తకైనా ఎలా నచ్చుతుంది అని అంటాడు. వసు.. నువ్వు రోడ్డుపై నన్ను ఎదిరించిన తీరు, ధైర్యం నాకు బాగా నచ్చాయి.. అలాంటివి ధరణికి కూడా నేర్పించమని ఆమెను శైలేంద్ర అడుగుతాడు. మనం ఎంత ప్రయత్నించినా కొంతమంది సహజసిద్ధమైన స్వభావాన్ని అంత త్వరగా మార్చలేమని వసు అంటుంది. మీరు చెప్పింది బాగుంది.. కానీ ధరణి త్వరగా నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అంటూ శైలేంద్ర అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
రిషి-వసు రొమాంటిక్ ఛాటింగ్..
సీన్ కట్ చేస్తే రిషి గదిలో బుక్ చదువుతుంటాడు. అందులో కూడా వసుధార పేరే కనిపిస్తుంది. ఒక్కసారి తనతో మాట్లాడాలి అని అనుకుంటాడు. వెంటనే ఫోన్ తీసి ఆమె ఫొటో చూస్తూ మిస్ యూ అని అంటాడు. వసుధార ఏం చేస్తుందో ఒక్కసారి మెసేజ్ చేద్దామనుకుని ఏం చేస్తున్నావ్ అంటూ మెసేజ్ చేస్తాడు. మరోపక్క వసు కూడా నిద్దరపోదామని రెప్పలు మూశాను సార్.. కానీ మనసు మూతపడట్లేదని బదులిస్తుంది వసు. ఇలా ఇద్దరూ ఒకరికొకరు ఛాటింగ్ చేసుకుంటూ రొమాంటిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అన్నయ్య వచ్చారని ఆ సంతోషంలో మీకు నిద్రపట్టట్లేదా అని వసు మెసేజ్ చేస్తుంది. నా సంతోషం నీకర్థమైంది కదా అందుకే రిషి సమాధానమిస్తాడు.
ఇంక అక్కడ నుంచి వసు లేచి మెసేజ్ చేసుకుంటూ హాల్‌లోకి వస్తుంది. ఇంతలో జగతీ వచ్చి.. ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. ఇందుకు వసు నిద్రపట్టలేదని బదులిస్తుంది. అంటే టెర్రస్ మీద ఇప్పుడు చంద్రుడితో కబుర్లా అని అడుగుతుంది జగతీ. ఇంతలో ధరణి.. చాప, దిండు తీసుకొని ధరణి తన రూమ్ నుంచి బయటకెళ్లడం వసు-జగతీ చూస్తారు. వసు వెళ్లబోతుంటే ఇప్పుడు మాట్లాడే సమయం కాదంటూ వసును వారిస్తుంది. మనం గమనించామని తెలిస్తేనే ధరణి బాధపడుతుందని చెప్పడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.