Guntur Kaaram Celebrations: గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న మూవీ టీమ్: ఫొటోలు-guntur kaaram movie team celebrates blockbuster success ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Guntur Kaaram Celebrations: గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న మూవీ టీమ్: ఫొటోలు

Guntur Kaaram Celebrations: గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న మూవీ టీమ్: ఫొటోలు

Jan 15, 2024, 11:32 PM IST Chatakonda Krishna Prakash
Jan 15, 2024, 11:32 PM , IST

  • Guntur Kaaram Celebrations: బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్లను జరుపుకుంది గుంటూరు కారం మూవీ టీమ్. ఈ ఫొటోలను సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యాపీ సంక్రాంతి చెబుతూ ఈ ఫొటోలను షేర్ చేశారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్న తరుణంలో బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్లను నేడు (జనవరి 15) మూవీ టీమ్ చేసుకుంది. 

(1 / 6)

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్న తరుణంలో బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్లను నేడు (జనవరి 15) మూవీ టీమ్ చేసుకుంది. (Twitter)

హీరో మహేశ్ బాబు, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిర్మాతలు దిల్‍రాజు, నాగవంశీ కలిసి గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్నారు. మహేశ్ ఇంట్లోనే ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు. 

(2 / 6)

ఈ ఫొటోలను మహేశ్ బాబు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్స్ అని క్యాప్షన్ రాశారు. నేడు సంక్రాంతి కావడంతో విషెస్ తెలిపారు. 

(3 / 6)

ఈ ఫొటోలను మహేశ్ బాబు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్స్ అని క్యాప్షన్ రాశారు. నేడు సంక్రాంతి కావడంతో విషెస్ తెలిపారు. 

గుంటూరు కారం సినిమాకు మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. అయినా, మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 164 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు ఈ చిత్రాన్ని నిర్మించిన హారిక, హాసినీ క్రియేషన్స్ వెల్లడించింది. 

(4 / 6)

గుంటూరు కారం చిత్రంలో రమణ అనే మాస్ క్యారెక్టర్ చేశారు మహేశ్. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. గుంటూరు కారం మూవీలో మాస్ యాక్షన్, మదర్ సెంటిమెంట్ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. 

(5 / 6)

గుంటూరు కారం చిత్రంలో మహేశ్ బాబు యాక్షన్ సీన్లు, డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్‌ను ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్లో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు