Prabhas: ప్రభాస్ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమదే అని చెప్పిన దర్శకుడు
ఛత్రపతి తర్వాత మదర్ సెంటిమెంట్‌కు యాక్షన్ అంశాలతో ప్రభాస్ (prabhas) చేసిన సినిమా యోగి(yogi movie). వినాయక్ (vv vinayak) దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా సరైన విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాల్ని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. అన్ని భాషల్లో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. వర్షం, చక్రం లాంటి లవ్ స్టోరీస్‌తో సాఫ్ట్ హీరోగా ఉన్న ప్రభాస్‌కు ఛత్రపతితో మాస్, యాక్షన్ ఇమేజ్‌ను రాజమౌళి తీసుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో ప్రభాస్ కెరీర్‌లో ఛత్రపతి పెద్ద హిట్ గా నిలిచింది. ఛత్రపతి తర్వాత మరోసారి మదర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో ప్రభాస్ చేసిన సినిమా యోగి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాల్ని ఓ ఇంటర్వ్యూలో వినాయక్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన జోగి సినిమా ఆధారంగా యోగిని వినాయక్ తెరకెక్కించాడు. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా మార్పులు చేయలేదని, అందువల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని వినాయక్ చెప్పాడు. కన్నడ సినిమాలో హీరో తల్లి చనిపోతుందని, ఆ ఎపిసోడ్ ను తెలుగులో అలాగే తీశానని, ఆ సీన్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతోనే సినిమాను ఆదరించలేదని పేర్కొన్నాడు.
ఒకవేళ హీరో తల్లి ని బతికిస్తే రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పాడు. వినాయక్‌తో ప్రభాస్ చేసిన ఏకైక సినిమా ఇదే. యోగి తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చినా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
సంబంధిత కథనం