Virata Parvam: అడుగే పిడుగై రాలే లాగా గుండెలో దమ్ము చూపించు...విరాటపర్వం ఛలో ఛలో సాంగ్ రిలీజ్....-chalo chalo full song unveiled from virataparvam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virata Parvam: అడుగే పిడుగై రాలే లాగా గుండెలో దమ్ము చూపించు...విరాటపర్వం ఛలో ఛలో సాంగ్ రిలీజ్....

Virata Parvam: అడుగే పిడుగై రాలే లాగా గుండెలో దమ్ము చూపించు...విరాటపర్వం ఛలో ఛలో సాంగ్ రిలీజ్....

Nelki Naresh Kumar HT Telugu
Jun 12, 2022 06:17 PM IST

జూన్ నెల‌లో టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో విరాట‌ప‌ర్వం ఒక‌టి. న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌కు ప్రేమ‌క‌థ‌ను జోడించి రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ సినిమాలోని ఛ‌లోఛ‌లో పాట‌ను ఆదివారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

<p>రానా, సాయిపల్లవి</p>
రానా, సాయిపల్లవి (twitter)

విరాట‌ప‌ర్వం సినిమాతో జూన్ 17న ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధమయ్యారు హీరో రానా ద‌గ్గుబాటి. న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌కు ప్రేమ‌క‌థ‌ను జోడించి తెర‌కెక్కిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. తూము స‌ర‌ళ అనే ఉద్య‌మ‌నాయ‌కురాలి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

yearly horoscope entry point

ఇందులో కామ్రేడ్ ర‌వ‌న్న‌గా రానా,వెన్నెల పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. స‌మాజ‌మే ముఖ్య‌మ‌ని భావించే ర‌వ‌న్న జీవితంలోకి వెన్నెల ఎలా ప్ర‌వేశించింద‌నే పాయింట్‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఆవిష్క‌రించారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని ఛ‌లో ఛ‌లో అనే పోరాట గీతాన్ని ఆదివారం చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. ఈ పాట‌ను రానా పాడ‌టం గ‌మ‌నార్హం. దోపిడీ దొంగ‌ల రాజ్యం మార‌దులే..రౌద్ర‌పు శ‌త్రువు దాడిని ఎదురించే పోరాటం మ‌న‌దే. ఛ‌లో ఛ‌లో ప‌రిగెత్తు..అడుగే పిడుగై రాలే లాగా అంటూ స్ఫూర్తిదాయంగా ఈ గీతం సాగింది.

జిలుక‌ర శ్రీనివాస్ ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. సురేష్ బొబ్బిలి స్వ‌ర‌క‌ర్త‌. ఈ సినిమాలో న‌క్స‌ల్ నాయ‌కుడిగా,ప్రేమికుడిగా డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో రానా క‌నిపించ‌బోతున్నారు. ప్రియ‌మ‌ణి,న‌వీన్‌చంద్ర‌,నందితాదాస్‌,జ‌రీనా వ‌హాబ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. తొలుత ఈ సినిమాను జూలై 1న విడుద‌ల‌చేయాల‌ని భావించారు. జూన్ 17న విడుద‌ల‌కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదాప‌డ‌టంతో ముందుగానే ఈసినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం