Bobby Deol in Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు సెట్‌లోకి బాబీ డియోల్.. పవర్‌స్టార్‌తో ఢీ
Bobby Deol in Hari Hara Veera Mallu: బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ హరి హర వీర మల్లు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి ఆయన అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం పంచుకుంది.
Bobby Deol in Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం హరి హర వీర మల్లు. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ సినిమా విషయంలో పవర్‌స్టార్ వేగాన్ని పెంచారు. షూటింగ్‌లో పాల్గొంటూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ఇండియా ప్రాజెక్టుకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుం బాలీవుడ్ అగ్రగామీ హీరోల్లో ఒకరైన బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన హరి హర వీర మల్లు సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేశారు మేకర్స్.
“భారత్ చలన చిత్ర సీమల్లో అతిపెద్ద స్టార్లలో ఒకరు, అత్యుత్తమ నటుడై బాబీ డియోల్‌ను మేము స్వాగతిస్తున్నాం. హరి హర వీర మల్లు ప్రపంచంలోకి మీకు ఆహ్వానం పలుకుతున్నాం.” అంటూ ట్విటర్ వేదికగా తెలియజేశారు మేకర్స్. అంతేకాకుండా బాబీ డియోల్ వస్తున్నట్లు వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కట్ బనియన్‌లో ఉన్న బాబీ డియోల్ కారులో నుంచి సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ పోస్టుపై పవర్ స్టార్ అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు.
బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రముఖ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్‌ను రూపొందించారు. పవన్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా స్పందన వచ్చింది. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఏక కాలంలో విడుదల కానుందీ చిత్రం.
ఈ చిత్రానికి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత బాణీలు అందిస్తుండగా, పేరొందిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా కె.ఎల్. ప్రవీణ్ పూడి, విఎఫ్ఎక్స్ హరి హర సుతన్, పోరాటాలు శామ్ కౌశల్, తడోర్ లజరొవ్ జుజి, రామ్ లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్ లు సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం