Biggest Flop of 2023: బడ్జెట్ 200 కోట్లు.. వచ్చింది 20 కోట్లు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమానే..
Biggest Flop of 2023: ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏదో తెలుసా? ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేయడం విశేషం.
Biggest Flop of 2023: ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే 2023లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా? బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించిన ఈ సినిమా పేరు గణపత్. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. కేవలం రూ.20 కోట్లే వసూలు చేసింది.
గతంలో క్వీన్, లూటేరా, ఉడ్తా పంజాబ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిన వికాస్ బెహల్ డైరెక్ట్ చేసిన గణపత్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. పెట్టిన బడ్జెట్ లో కేవలం పది శాతం వసూళ్లే సాధించిన ఈ సినిమా 2023లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. టైగర్ ష్రాఫ్ కు మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది.
గణపత్ మూవీ ఓ సై-ఫి థ్రిల్లర్. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు అసలు ఎందుకు ఈ మూవీ తీశాడన్నట్లుగా రివ్యూలు ఇచ్చారు. అటు డైరెక్టర్ కూడా ఇదే ఫీలింగ్ తో ఉండటం విశేషం. నిజానికి సినిమా తీసే సమయంలో తనపై తనకే సందేహం కలిగినట్లు వికాస్ బెహల్ చెప్పాడు. టైగర్ ష్రాఫ్ తోపాటు అమితాబ్ బచ్చన్, కృతి సనన్ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు.
సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత అసలు స్టోరీ ఏ దిశలో వెళ్తుందో అర్థం కాలేదని ఓ ఇంటర్వ్యూలో వికాస్ చెప్పాడు. అతడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ గణపత్ అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఎందుకిలా జరిగిందో అర్థం కాక తలపట్టుకున్నాడు. మొదలు పెట్టక ముందు అనుకున్న స్టోరీ మొదలైన తర్వాత దశ, దిశ లేకుండా పోయిందని వికాస్ అనడం గమనార్హం.
నిజానికి మూడేళ్ల కింద అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయింది. యూకే, లఢాక్, ముంబైలాంటి ప్లేస్ లలో మూవీ షూటింగ్ చేశారు.