Bigg Boss Waxing Challenge: ఆ ముగ్గురికీ చుక్కలు చూపించిన బిగ్ బాస్.. వ్యాక్సింగ్‌ చేయించుకోవాలంటూ..-bigg boss 8 telugu today episode waxing challenge for contestants prithvi nabeel nikhil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Waxing Challenge: ఆ ముగ్గురికీ చుక్కలు చూపించిన బిగ్ బాస్.. వ్యాక్సింగ్‌ చేయించుకోవాలంటూ..

Bigg Boss Waxing Challenge: ఆ ముగ్గురికీ చుక్కలు చూపించిన బిగ్ బాస్.. వ్యాక్సింగ్‌ చేయించుకోవాలంటూ..

Hari Prasad S HT Telugu
Sep 12, 2024 03:55 PM IST

Bigg Boss Waxing Challenge: బిగ్ బాస్ 8 తెలుగు ఈరోజు (సెప్టెంబర్ 12) ఎపిసోడ్లో ఆ ముగ్గురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చుక్కలు చూపించాడు. వ్యాక్సింగ్ ఛాలెంజ్ విసరడంతో వాళ్లు నొప్పితో అల్లాడిపోయారు. ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగా సాగింది.

ఆ ముగ్గురికీ చుక్కలు చూపించిన బిగ్ బాస్.. వ్యాక్సింగ్‌ చేయించుకోవాలంటూ..
ఆ ముగ్గురికీ చుక్కలు చూపించిన బిగ్ బాస్.. వ్యాక్సింగ్‌ చేయించుకోవాలంటూ..

Bigg Boss Waxing Challenge: బిగ్ బాస్ 8 తెలుగు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్లకు కొత్త కొత్త గేమ్స్, ఛాలెంజులతో ఈ షోని రక్తి కట్టించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా గురువారం (సెప్టెంబర్ 12) రాత్రి రాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన పలు ప్రోమోలు రిలీజ్ చేయగా.. అందులో ఒక దాంట్లో ముగ్గురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ వ్యాక్సింగ్ ఛాలెంజ్ విసరడం విశేషం.

బిగ్ బాస్ వ్యాక్సింగ్ ఛాలెంజ్

బిగ్ బాస్ 8 తెలుగు తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందులో ముగ్గురు కంటెస్టెంట్లు.. పృథ్వీ, నబీల్, నిఖిల్ లకు బిగ్ బాస్ వ్యాక్సింగ్ ఛాలెంజ్ విసిరాడు. ఐదో అవకాశం విలువ 50 వేలు.. మీరు చేయాల్సిందిల్లా వ్యాక్స్ చేసుకోవడం అని అనడంతో ఆ ముగ్గురూ దానికి రెడీ అయిపోయారు.

తర్వాత పృథ్వీ, నబీల్, నిఖిల్ ముగ్గురూ వ్యాక్సింగ్ లో పోటీ పడ్డారు. ఎక్కువ చేస్తే వాళ్లే విజేతలుగా నిలిచే ఛాన్స్ ఉండటంతో వాళ్లు తమ కాళ్లు, ఛాతీపై ఉన్న వెంట్రుకలను తొలగించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నొప్పితో వాళ్లు అల్లాడిపోవడం ఈ ప్రోమోలో చూడొచ్చు. ఈ వ్యాక్సింగ్ ఛాలెంజ్ లో ఎవరు గెలిచారన్నది ఈరోజు ఎపిసోడ్లో తేలనుంది.

ఆ ముగ్గురికీ డోన్ట్ స్పిల్ ఛాలెంజ్

ఇక బిగ్ బాస్ మరో ముగ్గురికి డోన్ట్ స్పిల్ ఛాలెంజ్ విసిరాడు. అభయ్ నవీన్, ఆదిత్య, నిఖిల్ ఇందులో పోటీ పడ్డారు. అక్కడున్న గ్లాసులో బాటిల్స్ లో ఉన్న పల్పీ ఆరెంజ్ జ్యూస్ ను పోయాల్సి ఉంటుంది. గ్లాసులోని జ్యూస్ బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఒక్కో చుక్కా వేస్తూ ఈ ముగ్గురూ ఈ ఛాలెంజ్ లో గెలవడానికి ప్రయత్నించారు.

నవీన్, ఆదిత్య, నిఖిల్ లలో ఎవరు గెలిచారన్నది కూడా ఇవాళ్టి ఎపిసోడ్లో చూడొచ్చు. ఇక ఇదే ప్రోమో చివర్లో విష్ణుప్రియ, సోనియా మధ్య గొడవ జరిగింది. కిచెన్ లో వాళ్లు మాటామాటా అనుకోవడం ప్రోమోలో చూపించారు.

కింద పడిన సోనియా

అంతకుముందు మరో ప్రోమోను కూడా స్టార్ మా రిలీజ్ చేసింది. అందులో "గత సీజన్‌లో మునుపెన్నడు లేనివిధంగా ఇన్‌ఫినిటీ మనీని ప్రైజ్ మనీగా సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. దానికోసం సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే మొదటి అవకాశం కోసం సిద్ధంగా ఉండండి" అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో బజర్ మోగింది.

హౌజ్‌లో ఉన్న స్క్రీన్‌లో పూల్ జంప్ అని టాస్క్ ఇస్తూ మణికంఠ, విష్ణుప్రియ, సోనియా ఆకుల పేర్లు ఇచ్చారు. దాంతో ముగ్గురు స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెత్తారు. అయితే, వారిని మిగతా క్లాన్ కంటెస్టెంట్స్ ఆపొచ్చు. ఈ క్రమంలో మణిని పృథ్వీ ఆపాడు. పక్కనుంచి పరుగెడుతున్న సోనియా అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆమె పడిన విధానం చూస్తే దెబ్బలు తగిలినట్లు ఉన్నాయి.