Bigg Boss Telugu 8: కిందపడిన సోనియా- తల పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అన్న నిఖిల్- 50 వేల కోసం చిన్నోడి పెద్దోడి ఫైట్-bigg boss telugu 8 day 11 promo sonia fall down nikhil fight with prithviraj bigg boss 8 telugu today episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: కిందపడిన సోనియా- తల పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అన్న నిఖిల్- 50 వేల కోసం చిన్నోడి పెద్దోడి ఫైట్

Bigg Boss Telugu 8: కిందపడిన సోనియా- తల పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అన్న నిఖిల్- 50 వేల కోసం చిన్నోడి పెద్దోడి ఫైట్

Sanjiv Kumar HT Telugu
Sep 12, 2024 12:13 PM IST

Bigg Boss Telugu 8 September 12th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇచ్చిన ఓ టాస్క్‌లో సోనియా ఆకుల కిందపడిపోయింది. దాని గురించి నిఖిల్ మాట్లాడుతూ మనం ఆర్టిస్టులం, తల పలిగితే ఎవడిది బాధ్యత అని ఫైర్ అయ్యాడు. ఇది తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు.

కిందపడిన సోనియా.. తల పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అన్న నిఖిల్.. 50 వేల కోసం చిన్నోడితో పెద్దోడి ఫైట్
కిందపడిన సోనియా.. తల పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అన్న నిఖిల్.. 50 వేల కోసం చిన్నోడితో పెద్దోడి ఫైట్

Bigg Boss Telugu 8 Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రెండో వారం నామినేషన్స్ బాగానే జరిగాయి. దాంతో 8 మంది ఇంటి సభ్యులు సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ అనంతరం హౌజ్‌లో కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ టాస్క్‌లు ఇస్తాడన్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం మిగిలిన 13 మందికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.

మొదటి అవకాశం

దీనికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో "గత సీజన్‌లో మునుపెన్నడు లేనివిధంగా ఇన్‌ఫినిటీ మనీని ప్రైజ్ మనీగా సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. దానికోసం సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే మొదటి అవకాశం కోసం సిద్ధంగా ఉండండి" అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో బజర్ మోగింది.

దెబ్బలు తగినట్లు

హౌజ్‌లో ఉన్న స్క్రీన్‌లో పూల్ జంప్ అని టాస్క్ ఇస్తూ మణికంఠ, విష్ణుప్రియ, సోనియా ఆకుల పేర్లు ఇచ్చారు. దాంతో ముగ్గురు స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెత్తారు. అయితే, వారిని మిగతా క్లాన్ కంటెస్టెంట్స్ ఆపొచ్చు. ఈ క్రమంలో మణిని పృథ్వీ ఆపాడు. పక్కనుంచి పరుగెడుతున్న సోనియా అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆమె పడిన విధానం చూస్తే దెబ్బలు తగిలినట్లు ఉన్నాయి.

గెలిచిన విష్ణుప్రియ

సోనియా మొహం నేలకు కాస్తా తగినట్లుగా కనిపించింది. అదే సమయంలో పక్కనుంచి పరుగెత్తిన విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్‌లో దూకింది. తర్వాత మణికంఠ దూకాడు. దాంతో విష్ణుప్రియ గెలిచింది. సోనియా ఫీల్ అవుతూ కనిపించింది. తనను పృథ్వీ ఓదార్చాడు. మణిని పృథ్వీ ఆపడంపై నిఖిల్ మాట్లాడుతూ ఫైర్ అయ్యాడు.

తల పగిలితే

"ఇప్పుడు నువ్ వచ్చావ్. మణి ప్లేసులో నేనుంటే రఫ్‌గా ఆడతాను కదా. నీకన్న తగలొచ్చు.. నాకన్న తగలొచ్చు.. మనందరం ఆర్టిస్టులం మచ్చా.. తల.. గిల.. పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లేదు" అని నిఖిల్ అన్నాడు. కట్ చేస్తే.. అక్కడే నిఖిల్‌పై యశ్మీ కోప్పడుతూ కనిపించింది. "సెంటిమెంటల్‌గా మాట్లాడి మాట్లాడి మా గేమ్‌లన్ని పక్కనపెట్టి నీదానికి అడ్జస్ట్ అయిపోయావాలా" అని యశ్మీ అరిచింది.

50 వేల కోసం

నిఖిల్, యశ్మీ వాదించుకున్నట్లు చూపించారు. తర్వాత "రెండో అవకాశం విలువ రూ. 50 వేలు. ప్లాస్మాలో చూపించిన సభ్యులు కలర్ బాల్స్ టాస్క్ ఆడాలి" అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. స్క్రీన్‌లో పృథ్వీ, నబీల్, నిఖిల్ పేర్లు ఉన్నాయి. వీళ్లు ఓ తాడును పట్టుకుని లాక్కెళ్తూ తమకు చెందిన కలర్ బాల్స్‌ను తమ బాస్కెట్‌లో వేయాలి. 50 వేలకోసం జరిగే ఈ పోటీలో తాడును నబీల్ పట్టుకోలేకపోయాడు.

చిన్నోడు వర్సెస్ పెద్దోడు

దాంతో చివరిగా పృథ్వీ, నిఖిల్ మిగిలారు. ఇద్దరూ పోటాపోటీగా టాస్క్ ఫైట్ చేశారు. అలా చేస్తూ ఇద్దరూ కిందపడిపోయారు. ఇలా 50 వేల టాస్క్ కోసం సోనియా చిన్నోడు పెద్దోడు అని పిలిచే పృథ్వీ, నిఖిల్ ఫైట్‌కు దిగారు.