ఫిబ్రవరి 25 తర్వాతే పెద్ద సినిమాల జాతర: దిల్ రాజు-big cinemas release after feb 15th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఫిబ్రవరి 25 తర్వాతే పెద్ద సినిమాల జాతర: దిల్ రాజు

ఫిబ్రవరి 25 తర్వాతే పెద్ద సినిమాల జాతర: దిల్ రాజు

HT Telugu Desk HT Telugu
Jan 29, 2022 01:32 PM IST

కరోనా థర్డ్ వేవ్ ప్రభావంతో సంక్రాంతికి విడుదలకావాల్సిన పెద్ద సినిమాలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. వైరస్ ఉధృతి పెరగడంతో ప్రేక్షకులు థియేటర్ల కు వస్తారా?లేదా? అన్న భయాలు సినీ వర్గాల్లో నెలకొన్నాయి. అయితే దీనిపై దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చారు.

<p>నిర్మాత దిల్ రాజు&nbsp;</p>
నిర్మాత దిల్ రాజు

కోవిడ్ థర్డ్ వేవ్ ముగిసి తిరిగి సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయనే సంశయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. వీటిపై అగ్ర నిర్మాత దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25 తర్వాతే తెలుగులో పెద్ద సినిమాల విడుదలకు అనువైన పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అప్పటిలోగా కరోనా భయాలన్నీ తొలగిపోతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు. 

మా మధ్య విభేదాలు లేవు..

ఫిబ్రవరి 25 తర్వాత సినీ పరిశ్రమ తిరిగి గాడిన పడటం ఖాయమని దిల్ రాజు అన్నారు. పెద్ద సినిమాలను పోటీగా విడుదల చేస్తుండటంతో నిర్మాతల మధ్య అభిప్రాయభేదాలు నెలకొనే అవకాశముందంటూ పాత్రికేయులు అడిగిన ప్రశ్నపై దిల్ రాజు స్పందిస్తూ ‘నిర్మాతల మధ్య విభేదాలు అంటూ బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. తెలుగు నిర్మాతలందరి మధ్య చక్కటి అవగాహన ఉంది. అవసరమైతే ఒకరికోసం మరొకరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విడుదల తేదీల విషయంలో మా మధ్య ఎలాంటి సమస్యలు రావు‘ అని తెలిపారు. 

ఏపీ సినిమా టికెట్ల రేట్ల విషయంలో నెలకొన్న సమస్యలు ఫిబ్రవరి నెలాఖరులోగా పరిష్కారమవుతాయనే నమ్మకముందని దిల్ రాజు చెప్పారు. టికెట్ల రేట్ల సమస్యలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని దిల్ రాజు పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం