భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఇదేనా?-bhimla naik release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఇదేనా?

భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఇదేనా?

HT Telugu Desk HT Telugu
Feb 08, 2022 01:35 PM IST

పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లానాయక్’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

<p>భీమ్లా నాయక్‌లో పవన్ కళ్యాణ్</p>
భీమ్లా నాయక్‌లో పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లానాయక్’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ ఆధారంగా ఎమోషనల్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1లలో ఏదో ఒక తేదీన విడుదల చేస్తామని ఇటీవలే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 25 నే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మంచిదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం.

yearly horoscope entry point

ఏప్రిల్ 1న సినిమాను విడుదలచేస్తే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయంలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలిసింది. మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకానుంది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన వారం తర్వాత ‘భీమ్లానాయక్’ ను రిలీజ్ చేస్తే వసూళ్లపై ప్రభావం పడటమే కాకుండా థియేటర్స్ పరంగా సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఏప్రిల్ 1న కాకుండా ఫిబ్రవరి 25 అయితేనే బెటర్ అనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు తెలిసింది. 

ఏపీలో నిర్ణయం తరువాతే..

మరోవైపు ఏపీలో నైట్ కర్ఫ్యూ పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతినివ్వవచ్చని అంటున్నారు. అది కూడా ‘భీమ్లానాయక్’ సినిమాకు ప్లస్ కావొచ్చు. ఆ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రిలీజ్ డేట్ పై తుది నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు పలువురు నెటిజన్లు కూడా ఈ సినిమా ఫిబ్రవరి 25నే విడుదలకాబోతున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ నెల పండుగే అవుతుంది. మరో పదిహేను రోజుల్లో తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లలో చూసుకోవచ్చు. ఇందులో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. రానా డానియల్ శేఖర్ అనే పాత్ర చేస్తున్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Whats_app_banner