Veera Simha Reddy 10 Days Collection : బాలయ్య వీరసింహారెడ్డి 10 రోజుల కలెక్షన్స్ ఇవే..-balakrishna veera simha reddy movie 10 days collections in wold wide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Veera Simha Reddy 10 Days Collection : బాలయ్య వీరసింహారెడ్డి 10 రోజుల కలెక్షన్స్ ఇవే..

Veera Simha Reddy 10 Days Collection : బాలయ్య వీరసింహారెడ్డి 10 రోజుల కలెక్షన్స్ ఇవే..

Anand Sai HT Telugu
Jan 22, 2023 01:23 PM IST

Balayya Veera Simha Reddy 10 Days Box Office Collections : నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. ఎంత ఉందంటే..?

వీరసింహారెడ్డిలో బాలకృష్ణ
వీరసింహారెడ్డిలో బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) పోటీగా వచ్చినా.. బాలయ్య సినిమా దూసుకెళ్తోంది. వీరసింహారెడ్డిలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున సినిమాను నిర్మించింది. సంక్రాంతి(Sankranti) కానుకగా విడుదల అయిందీ మూవీ. తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి హిట్ టాక్ సాధించింది. సినిమా విడుదలై.. పదిరోజుల దాటింది. మెుత్తంగా ఎన్ని కోట్ల వసూళ్లు చేసిందంటే..

బాలయ్య అంతకుముందు చిత్రం.. అఖండ(Akhanda) మెుదటి వారం.. రూ.53.49 కోట్ల షేర్(రూ.87.9 కోట్ల గ్రాస్) సాధించింది. అయితే వీరసింహారెడ్డి(Veera Simha Reddy) మాత్రం మెుదటి వారంలో రూ.68.51 కోట్ల షేర్(రూ.114.95) వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. మెుదటి రోజు, రెండో రోజు దూకుడుగా వెళ్లింది బాలయ్య సినిమా. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీసు దగ్గర 1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టుగా చెబుతున్నారు.

వీరసింహారెడ్డికి మెుదటి రోజు.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.35 కోట్ల షేర్ రాబట్టగా.. ప్రపంచ వ్యాప్తంగా కలిపితే.. తొలి రోజు రూ. 31.05 కోట్ల షేర్ (రూ. 50.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు రూ. 6.15 కోట్లు (రూ. 11.05 కోట్ల గ్రాస్), మూడో రోజు రూ. 7.30 కోట్లు (రూ. 12.75 కోట్లు గ్రాస్) నాలుగో రోజు రూ. 8.15 కోట్లు (రూ. 14.20 కోట్ల గ్రాస్), ఐదో రోజు రూ.7.25 కోట్ల షేర్ రూ. 12.50 కోట్ల గ్రాస్) సాధించింది.

ఈ సినిమా పది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. నైజాం 16.26కోట్లు, సీడెడ్ రూ. 15.70 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.7.14 కోట్లు, తూర్పు గోదావరి రూ.5.37 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 4.03 కోట్లు, గుంటూరు రూ.6.18 కోట్లు, కృష్ణ రూ. 4.48 కోట్లు, నెల్లూరు రూ. 2.79 కోట్లు, తెలంగాణ ప్లస్ ఏపీ కలిపితే.. పదిరోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 61.95 కోట్లు (రూ.100.15 కోట్లు గ్రాస్)గా ఉంది. కర్ణాటక ప్లస్ ఇతర ప్రాంతాలు రూ.4.64 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.65 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా పదిరోజులు కలిపి చూస్తే.. రూ. 72.24కోట్లు షేర్ (రూ. 121.05 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయి.

సినిమా మెుత్తం మీద.. పది రోజు టోటల్ కలెక్షన్స్ అవి. 74 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది సినిమా. బాక్సాఫీసు వద్ద.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.76 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఇక అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని చెప్పాలి.

Whats_app_banner