Telugu News  /  Entertainment  /  Balakrishna Drinks Champagne With Honey Rose After Veera Simha Reddy Success
హనీ రోజ్‌తో కలిసి షాంపేన్ తాగుతున్న బాలకృష్ణ
హనీ రోజ్‌తో కలిసి షాంపేన్ తాగుతున్న బాలకృష్ణ

Balakrihna and Honey Rose Party: "అరే భామ ఏక్ పెగ్ లా".. హనీ రోజ్‌తో బాలయ్య మందు పార్టీ.. ఫొటో వైరల్

24 January 2023, 7:47 ISTMaragani Govardhan
24 January 2023, 7:47 IST

Balakrihna and Honey Rose Party: వీరసింహారెడ్డి సినిమా సక్సెస్‌లో భాగంగా బాలకృష్ణ ఫుల్ ఆనందంతో ఉన్నారు. సినిమాలో హీరోయిన్‌గా నటించిన హనీ రోజ్‌తో కలిసి షాంపేన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Balakrihna and Honey Rose Party: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే వీరసింహారెడ్డి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా రిజల్ట్ పరంగా మిక్స్‌డ్ టాక్ వినిపించినప్పటికీ బాలయ్య అభిమానులకు మాత్రం ఫుల్ ఖుషీ చేసింది. ఫలితంగా ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. దీంతో చిత్రబృందం ఇప్పటికే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ సినిమాలో బాలయ్య సరసన హనీ రోజ్ నటించిన సంగతి తెలిసందే. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ అదరగొడుతోంది. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు అభిమానుల నుంచి నెటిజన్ల వరకు తెగ స్పందించేస్తున్నారు. అంతేకాకుండా వీరి జోడీ కూడా సూపర్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. తాజాగా బాలయ్య-హనీ రోజ్ ఇద్దరూ కలిసి ఆల్కహాల్‌ను ఆస్వాదించారు.

ట్రెండింగ్ వార్తలు

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ అనంతరం ఇద్దరూ చెరో పెగ్ తీసుకుని చేతులు మార్చుకుంటూ మరీ పెగ్‌ను ఆస్వాదించారు. ఒకరి చేతిలోనుంచి మరొకరి చేయిని పోనిచ్చి డార్క్ షాంపైన్‌ను తీసుకున్నారు. అతిథులందరి సమక్షంలో వీరిద్దరూ ఈ విధంగా చేయడం ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై విపరీతంగా స్పందిస్తున్నారు.

సొంత ఇమేజ్ చట్రంతో సంబంధం లేకుండా ఇంట్లో తను ఎలా ఉంటారో, ఉండాలనుకుంటారో బయట కూడా అలాగే ఉంటారు మన బాలయ్య. ఈ విధానమే ఆయనకు ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టింది. ఏ విషయంలోనూ దాపరికం లేకుండా బాహటంగా మాట్లాడుతూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ఇతర హీరోల లైఫ్ స్టైల్‌కు దాదాపు భిన్నంగా ఉండే బాలయ్య ఈ వయస్సులోనూ జీవితాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు నిదర్శన ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ ఫొటోనే.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.