Butta Bomma Teaser: 'మాట వింటే మనిషిని చూడాలనిపించాలి.. మాట్లాడితే పాట లాగా ఉండాలి..' బుట్ట బొమ్మ టీజర్ రిలీజ్-anikha surendran telugu movie butta bomma teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Butta Bomma Teaser: 'మాట వింటే మనిషిని చూడాలనిపించాలి.. మాట్లాడితే పాట లాగా ఉండాలి..' బుట్ట బొమ్మ టీజర్ రిలీజ్

Butta Bomma Teaser: 'మాట వింటే మనిషిని చూడాలనిపించాలి.. మాట్లాడితే పాట లాగా ఉండాలి..' బుట్ట బొమ్మ టీజర్ రిలీజ్

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 10:16 PM IST

Butta Bomma Teaser: అనిక సురేంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బుట్టబొమ్మ. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

బుట్ట బొమ్మ టీజర్ విడుదల
బుట్ట బొమ్మ టీజర్ విడుదల

Butta Bomma Teaser: వరుస చిత్రాల నిర్మాణంలోనే కాకుండా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ.'సితార ఎంటర్ టైన్ మెంట్స్'. తాజాగా ఈ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం "బుట్ట బొమ్మ". అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా "బుట్ట బొమ్మ" టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. విడుదలైన ప్రచార చిత్రాన్ని పరిశీలిస్తే ....ఆద్యంతం ప్రతిక్షణం ఆకట్టుకుంటూ,ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం ఆకట్టుకుంటోంది.

"మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్... ఇంకోసారి చెయ్యాలంటే ... ఇప్పుడు కాల్ కట్ చెయ్యాలి గా"..."మాటింటే మనిషిని చూడాలనిపించాలి.. మాట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుండాలి"... లాంటి సంభాషణలు చిత్రంపై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. అరవై ఐదు సెకన్ల పాటు సాగే ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం బాగున్నాయి.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ...‘"బుట్ట బొమ్మ‘గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి" అని తెలిపారు.

చిత్ర నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. దీంతో మూవీ విడుదల ఇతర వివరాలు, మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియ పరుస్తామని నిర్మాతలు తెలిపారు.

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగానటిస్తున్న ఈ చిత్రంలో నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Whats_app_banner

సంబంధిత కథనం