shah rukh khan: డాన్ 3 లో అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్...బాలీవుడ్ లో జోరుగా ప్రచారం -amitabh bachchan to be part of shahrukh khan don 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan: డాన్ 3 లో అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్...బాలీవుడ్ లో జోరుగా ప్రచారం

shah rukh khan: డాన్ 3 లో అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్...బాలీవుడ్ లో జోరుగా ప్రచారం

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 10:25 AM IST

బాలీవుడ్ లో డాన్ సిరీస్ సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఈ సిరీస్‌లో మూడో భాగం రూపొందనున్నట్లు కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూడో భాగంలో షారుఖ్‌ఖాన్(shahrukh khan) హీరోగా న‌టించ‌నున్నారు. మ‌రో అగ్ర న‌టుడు ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు తెలిసింది. అత‌డు ఎవ‌రంటే...

అమితాబ్‌బ‌చ్చ‌న్‌, షారుఖ్‌ఖాన్
అమితాబ్‌బ‌చ్చ‌న్‌, షారుఖ్‌ఖాన్ (twitter)

 సుదీర్ఘ విరామం త‌ర్వాత బిగ్‌బీ అమితాబ్‌బ‌చ్చ‌న్‌(amitabh bachchan), షారుఖ్‌ఖాన్ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో  కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో అమితాబ్, షారుఖ్ క‌ల‌యిక‌లో క‌భీ ఖుషీ క‌భీ గ‌మ్‌,  మోహ‌బ్బ‌త్తేన్‌, వీర్ జారా తో పాటు ప‌లు సినిమాలు రూపొందాయి. మరోసారి డాన్ 3(don 3) సినిమాలో వీరిద్ద‌రు క‌లిసి వెండితెర‌పై సంద‌డి చేయబోతున్న‌ట్లు తెలిసింది. 

డాన్ సిరీస్ సినిమాలు బాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాల్ని అందుకున్నాయి. ఈ సినిమాల‌కు బాలీవుడ్ ప్ర‌త్యేకంగా ఫ్యాన్‌బేస్ ఉంది. 1978 లో రూపొందిన డాన్ మొద‌టి భాగంలో అమితాబ్‌బ‌చ్చ‌న్ హీరోగా న‌టించారు. 2011లో తెర‌కెక్కిన డాన్ -2లో షారుఖాన్ డాన్ పాత్ర‌లో క‌నిపించారు. ఈ సిరీస్‌కు కొన‌సాగింపుగా డాన్‌-3 రూపొంద‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూడో భాగంలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, షారుఖ్‌ఖాన్ ఇద్ద‌రు న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల షారుఖ్‌ఖాన్‌తో దిగిన ఓ పాత ఫొటోను అమితాబ్‌బ‌చ్చ‌న్ షేర్ చేశారు.  ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.   

ఈ ఫొటోను ఉద్దేశిస్తూ డాన్ 3లో వీరిద్ద‌రు న‌టించ‌నున్న‌ది  నిజ‌మేనంటూ  ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. డాన్ 3 చిత్రానికి ఫ‌ర్హాన్ అక్త‌ర్ (farhan akthar) ద‌ర్శ‌క‌త్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇటీవ‌ల సీరియ‌స్ గా స్ర్కిప్ట్  రాస్తున్న ఓ ఫొటోను షేర్ ఫర్హాన్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు.    డాన్ -3 కోస‌మే ఆయ‌న క‌థ‌ను రాస్తున్న‌ట్లు చెబుతున్నారు.  త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి  సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. 

IPL_Entry_Point

టాపిక్