Aishwarya Rai Bachchan: బచ్చన్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన ఐశ్వర్య.. కూతురితో కలిసి వేరే ఇంట్లో..
Aishwarya Rai Bachchan: ఐశ్యర్య రాయ్ బచ్చన్ అత్తారింట్లో నుంచి బయటకు వచ్చేసిందా? కూతురుతో కలిసి వేరే ఇంట్లో ఉంటోందా? తాజాగా వస్తున్న వార్తలు అవే నిజమంటున్నాయి.
Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్‌కి బచ్చన్ ఫ్యామిలీతో పడటం లేదని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. తాజాగా ఆమె బచ్చన్ల ఇంట్లో నుంచి కూతురు ఆరాధ్యతో కలిసి బయటకు వచ్చేసిందని, ఈ ఇద్దరూ వేరే ఇంట్లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ జూమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
బచ్చన్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చినా.. ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్‌తో మాత్రం బాగానే ఉంటోందట. ఎటొచ్చీ అత్త జయా బచ్చన్ తోనే ఆమెకు పడటం లేదని తెలిసింది. ఈ ఇద్దరూ చాన్నాళ్లుగా మాట్లాడుకోవడం లేదని, అత్తాకోడళ్ల మధ్య ఫైట్ నడుస్తోందని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. వాటిని మరింత బలపరుస్తూ తాజాగా ఐశ్వర్య ఏకంగా ఇల్లే వదిలేసినట్లు తేలడం షాక్ కు గురి చేస్తోంది.
కేవలం అత్తతోనే గొడవ కావడంతో ఐశ్వర్య తన భర్త అభిషేక్ తో మాత్రం బాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తల్లి బృందా రాయ్, భర్త అభిషేక్ బచ్చన్ లకు ఆమె తగిన సమయం కేటాయిస్తోంది. అయితే వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదు. ఇక అభిషేక్ అక్క శ్వేతా బచ్చన్ కూడా బచ్చన్ల ఇంటికే తిరిగి రావడం కూడా ఐశ్వర్యకు నచ్చలేదని తెలుస్తోంది.
ఈ మధ్య శ్వేత తనయుడు అగస్త్య నంద నటించిన ది ఆర్చీస్ మూవీ ప్రీమియర్ కు ఐశ్వర్య కూడా వచ్చింది. అక్కడ బచ్చన్ ఫ్యామిలీతో కలిసి ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తన అత్తమామలకు దూరంగా నిల్చుంది. ఇక ఫొటోలకు పోజులిచ్చే సమయంలోనూ ఆరాధ్య తన తల్లి ఐశ్వర్య దగ్గరే ఉంది. అభిషేక్ తన దగ్గరికి తీసుకున్నా వెళ్లలేదు. ఈ వీడియో కూడా వైరల్ అయింది.