Goodachari 2 Announcement: గూఢచారి మళ్లీ వస్తున్నాడు.. ఈ సారి పాన్ఇండియా రేంజ్‌లో -adivi sesh goodachari 2 announcement on 2023 january 9 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Goodachari 2 Announcement: గూఢచారి మళ్లీ వస్తున్నాడు.. ఈ సారి పాన్ఇండియా రేంజ్‌లో

Goodachari 2 Announcement: గూఢచారి మళ్లీ వస్తున్నాడు.. ఈ సారి పాన్ఇండియా రేంజ్‌లో

Maragani Govardhan HT Telugu
Dec 29, 2022 01:44 PM IST

Goodachari 2 Announcement: అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌కు మార్గం సుగమమైంది. జీ2 టైటిల్‌తో ఈ చిత్రాన్ని జనవరి 9న ప్రకటించనున్నట్లు అడివి శేష్ తెలిపారు.

గూఢచారి 2 ప్రకటన
గూఢచారి 2 ప్రకటన

Goodachari 2 Announcement: టాలీవుడ్ హీరో అడివి శేష్‌కు ఈ ఏడాది రెండు బ్లాక్ హిట్లు దక్కాయి. జూన్‌లో విడుదలైన పాన్ఇండియా చిత్రం మేజర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోగా.. ఈ నెలలోనే విడుదలైన హిట్2 రూపంలో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ హీరో తన తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. అతడు 2018లో నటించిన గూఢచారి సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పిన శేష్.. తాజాగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

గూఢచారికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకూ జీ2గా(G2) తీసుకురానున్నారు. ఈ విషయాన్ని శేష్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. నూతన ఏడాది సందర్భంగా సినిమా గురించి తెలియజేసేలా ప్రీ విజన్ వీడియోను రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసేందుకుగాను ముంబయి, దిల్లీలో జనవరి 9న మాసివ్ ప్రకటన ఉంటుందని తెలిపారు.

ఈ ఎపిక్ యాక్షన్ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అతడు గతంలో మేజర్ సినిమాకు ఎడిటర్‌గా పనిచేశాడు. గూఢచారి 2 చిత్రాన్ని జనవరి 9న ప్రకటించి.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో సినిమా విడుదల చేసే అవకాశాలున్నాయి.

గూఢాచారి 2 చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనుంది. జనవరి 9న సినిమా అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత కథనం

టాపిక్